కార్పొరేటర్ అనుచరుల దాష్టీకం, వ్యక్తిని కొట్టుకుంటూ కిలోమీటర్ ఈడ్చుకెళ్లారు
భాగ్యనగరంలో మరో కార్పొరేటర్ అనుచరులు హంగామా సృష్టించారు. ఓ సామాన్యుడిపై తమ దాష్టీకం ప్రదర్శించారు. కొన్న బియ్యం నాణ్యంగా లేవన్న పాపానికి అతడిని కొట్టుకుంటూ ఓ కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో మరో కార్పొరేటర్ అనుచరులు హంగామా సృష్టించారు. ఓ సామాన్యుడిపై తమ దాష్టీకం ప్రదర్శించారు. కొన్న బియ్యం నాణ్యంగా లేవన్న పాపానికి అతడిని కొట్టుకుంటూ ఓ కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లారు.
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్.బి.నగర్ సర్కిల్ కార్యాలయం సమీపంలో ఉన్న మోడల్ రైతు చికెన్ బజార్‌లో కొన్న బియ్యం నాణ్యంగా లేవన్న పాపానికి బాధితుడిపై సరూర్ నగర్ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే మనుషులు దాడి చేశారు.

అతడిని కిలోమీటర్ వరకూ కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్లారు. చివరికి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌పై కూడా వారు దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. అయితే బియ్యం నాణ్యంగా లేవన్న వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications