తెలంగాణలో "సీక్రెట్ వాటర్ ఫాల్స్".. హైదరాబాద్ కు దగ్గర్లోనే..
తెలంగాణలో ఎన్నో చారిత్రకమైన ప్రదేశాలు, దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఎన్నోచోట్ల ప్రకృతి రమణీయమైన స్థావరాలు మనల్ని కనువిందు చేస్తున్నాయి. దట్టమైన అడవిలో మహాద్భుతమైన ఈ వాటర్ ఫాల్స్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఈ జలపాతం అందాలను చూస్తే.. మనం తెలంగాణలోనే ఉన్నామా అన్న సందేహం వస్తుంది. ఎత్తైన కొండ మీద నుంచి జాలువారే ఆ నీటి ప్రవాహం చూపరులను మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఇక్కడి వెళ్లాలంటే దట్టమైన అడవిని దాటి చేరుకోవాలి.
ఓ వైపు దట్టామైన అడవి.. పక్షుల రాగాలు.. జంతువుల విన్యాసాలు చూస్తూ వెళ్తుంటే.. ఆ అనుభూతి వర్ణనాతీతం. చాలా తక్కువ మందికే తెలిసిన ఈ సీక్రెట్ వాటర్ ఫాల్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల ఈ జలపాతానికి పర్యటకుల తాకిడి పెరిగింది. ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో ఈ వాటల్ ఫాల్స్ ఉంది. ఇక్కడికి చేరుకోవడం ఓ సాహసయాత్రగా చెప్పుకోవచ్చు. ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి ఈ యాత్ర ఓ మెమరబుల్ జర్నీగా మిగిలిపోతుంది.
ఈ జలపాతాన్ని మహితాపురం వాటర్ ఫాల్స్ అంటారు. ఇది తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం మహితాపురం అనే మారుమూల గ్రామంలో ఉంది. ఈ జలపాతం వరంగల్ కు దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్ కు ఈ జలపాతం 250 కి. మీ. ఉంటుంది. హైదరాబాద్ నుంచి వన్ డే ట్రిప్ గా ఈ ప్రాంతం సరిపోతుంది. ఈ ప్రాంతానికి కార్లు, బైక్ ల ద్వారా చేరుకోవచ్చు. వర్షాకాలంలో ఈ ప్రాంతం ఇంకా అందంగా మైమరిపిస్తుంది. సాహసయాత్రలు ఇష్టపడేవారికి ఈ ప్రదేశం బాగా సూట్ అవుతుంది.

ఇటీవలికాలంలో వీకెండ్స్ లో హైదరాబాద్ నుంచి పర్యటకుల తాకిడి పెరిగింది. కొంతమంది గ్రూప్స్ గా ఏర్పడి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. అలా ఈ వాటర్ ఫాల్స్ కు క్రేజ్ పెరుగుతోంది. ములుగు జిల్లా చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుందని పర్యటకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications