కొడంగల్‌ ఎమ్మెల్యేపై కిడ్నాప్, హత్యాయత్నం కేసు

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.

తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ముగిసింది.

Case files against BRS MLA Patnam Narender Reddy

ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వికారాబాద్ జిల్లాలోని కొండగల్‌ (Kodangal)కు చెందిన బీఆర్ఎస్ శాసన సభ్యుడు పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy)పై కేసు నమోదైంది. హత్యాయత్నం, కిడ్నాప్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆయనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మరో ఏడుమందిపై ఈ కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు పెట్టారు. ఇందులో ఏ1గా పట్నం నరేందర్ రెడ్డి పేరును నమోదు చేశారు.

కోస్గిలో కూర నరేష్ అనే వ్యక్తిపై దాడి చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కోస్గిలో తమ కారుకు సైడ్ ఇవ్వలేదనే కారణంతో బైక్‌పై వెళ్తోన్న కూర నరేష్‌పై పట్నం నరేందర్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, వారి అనుచరులు కర్రలతో దాడి చేసి చితగ్గొట్టినట్లు ఫిర్యాదులో పొందుపరిచారు. తనను హత్యచేయడానికి ప్రయత్నించారని బాధితుడు పేర్కొన్నాడు.

ఈ ఫిర్యాదుతో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిపై ఐపీసీలోని 30 7, 147, 148, 341, 392, 171- ఎఫ్ 504, 505, 149, మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 192 కింద కేసు నమోదు చేశారు.

ఈ ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో ఆయన కొడంగల్ నుంచి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన రేవంత్ రెడ్డిని ఓడించారు. ఇప్పుడు కూడా కొడంగల్‌లో వారిద్దరి మధ్యే పోటీ నెలకొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+