రేవంత్ రెడ్డిపై కేసు నమోదు; పాదయాత్ర వేళ కాంగ్రెస్ కు షాక్!!
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నాయకులు ములుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పాదయాత్ర ప్రారంభంలోనే కాంగ్రెస్ కు షాక్ తగిలింది.
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పాదయాత్ర ప్రారంభంలోనే చిక్కులు వచ్చి పడ్డాయి. ములుగు జిల్లాలో పాదయాత్ర కొనసాగించిన రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు, ఆయనపై ములుగు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.

ప్రగతి భవన్ పై రేవంత్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు
ఇంతకీ ఏం జరిగిందంటే సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో నిర్వహించిన హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్య ప్రజలు లోపలికి వెళ్లడానికి కూడా అనుమతి లేని ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చివేయాలంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆనాడు గడీలను గ్రనైడ్ లతో పేల్చివేసినట్టే.. ఇప్పుడు ప్రగతి భవన్ ని కూడా పేల్చివేయాలంటూ ఆయన నక్సలైట్లకు పిలుపునిచ్చారు.

నక్సలైట్లు బాంబులతో ప్రగతి భవన్ పేల్చాలన్న రేవంత్ రెడ్డి
ప్రగతి భవన్ గడీని తలపిస్తుంది కానీ.. సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలాగా ప్రగతిభవన్ లేదని ఆయన ఆరోపణలు గుప్పించారు. 2000 కోట్ల రూపాయలతో 120 గదులతో ప్రగతి భవన్ నిర్మాణం చేసుకున్నారని, సామాన్య ప్రజలు ఎవరూ ప్రగతి భవన్ కు వెళ్ళే అవకాశం లేదని, కేవలం ఏపీ పెట్టుబడిదారులను మాత్రమే ప్రగతి భవన్ లోకి అనుమతిస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అనుమతి లేని ప్రగతి భవన్ మనకు అవసరమా అంటూ ఆయన బాంబులతో ప్రగతి భవన్ పేల్చేయ్యాలని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు.. కేసు నమోదు
ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో బిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా, అల్లర్లను సృష్టించేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని బి ఆర్ ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ములుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చివేయాలని చేసిన వ్యాఖ్యలపై ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ములుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications