ఓటుకు నోటు కేసులో షాకింగ్ ట్విస్ట్ : చంద్రబాబే నాతో నేరుగా మాట్లాడారు , కోర్టులో స్టీఫెన్ సన్ వాంగ్మూలం
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును ఏసీబీ కోర్టు విచారిస్తోంది . ఈ కేసులో సాక్షిగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ గురువారం ఏసీబీ కోర్టులో విచారణ సమయంలో కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. చంద్రబాబు నేరుగా తనకు ఫోన్ చేసి మాట్లాడారని తనను ప్రలోభ పెట్టారని, టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని తనను అడిగారని ఆయన కోర్టులో షాకింగ్ విషయాలను వెల్లడించారు.

ఏసీబీ ప్రత్యేక కోర్టులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు
ఓటుకు నోటు కేసులో ఫిర్యాదుదారుడు గా ఉన్న స్టీఫెన్ సన్ గురువారం రోజు ప్రత్యేక ఏసీబీ కోర్టు ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడం కోసం చంద్రబాబు నేరుగా తనతో మాట్లాడాలి అనుకుంటున్నారని ఆంథోనీ అనే వ్యక్తి ద్వారా టిడిపి క్రిస్టియన్ సెల్ కన్వీనర్ గా ఉన్న సెబాస్టియన్ తన దగ్గరకు వచ్చారన్నారు. చంద్రబాబును తనతో మాట్లాడించారని, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసేందుకు ఎంత డబ్బు కావాలో చెప్తే ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్నిసెబాస్టియన్ తనకు చెప్పాడని స్టీఫెన్ సన్ పేర్కొన్నారు.

లంచం తీసుకోవటం ఇష్టం లేకనే ఏసీబీ అధికారులను ఆశ్రయించానన్న స్టీఫెన్ సన్
అయితే చంద్రబాబు ప్రతినిధిగా పార్టీలో కీలకమైన వ్యక్తి ఎవరైనా వస్తే తాను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్టు పేర్కొన్న స్టీఫెన్ సన్ బాబు ప్రతినిధిగా రేవంత్ రెడ్డి వచ్చారని, లంచం తీసుకోవడం ఇష్టం లేకనే తను ఏసీబీ అధికారులను సంప్రదించానని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు .
ఏసీబీ అధికారులను సంప్రదించిన తరువాత రేవంత్ రెడ్డి వచ్చిన క్రమంలో ఆధారాల నమోదు కోసం ఏసీబీ అధికారులు తన ఫ్లాట్ లో డివైజ్లను ఏర్పాటు చేసినట్లుగా, ఆడియో, వీడియో ఆధారాలను సేకరించినట్టుగా స్టీఫెన్ సన్ కోర్టుకు వివరించారు.

ఐదు కోట్లు ఇస్తామని అడ్వాన్స్ గా 50 లక్షలు .. రేవంత్ తో పాటు వారున్నారని వెల్లడి
2015 మే 30వ తేదీన రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహాలు తన ఫ్లాట్ కి వచ్చారు అని , బేరసారాలు చేసి యాభై లక్షల రూపాయల నగదు తన టేబుల్ పై పెట్టారని మిగిలిన డబ్బు ఓటింగ్ తర్వాత ఇస్తామని చెప్పారని , మొత్తం ఐదు కోట్ల రూపాయలు తన ఓటు కోసం ఇస్తామని టిడిపి నేతలు చెప్పినట్లుగా స్టీఫెన్ సన్ కోర్టుకు వెల్లడించారు. ఈ సమయంలోనే ఏసీబీ అధికారులు దాడి చేసి వారిని అరెస్ట్ చేసినట్లుగా స్టీఫెన్ సన్ తెలిపారు.

ఓటుకు నోటు కేసులో విచారణ ఈ నెల 7వ తేదీకి వాయిదా.. హైకోర్టులో ఉదయ సింహాకు షాక్
స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన ఏసీబీ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఈ కేసులో మిగతా వారి వాంగ్మూలాలను కూడా కోర్టు నమోదు చేయనుంది. మరోవైపు విచారణ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ లు ఏసీబీ కోర్టులో విచారణకు గైర్హాజరయ్యారు.
మరోవైపు ఈ కేసులో నిందితుడు ఉదయ సింహా దాఖలు చేసిన రివిజన్ పిటీషన్ ను సైతం హైకోర్టు కొట్టేసింది . ఈ కేసులో ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కేసును పునః పరిశీలించలేమని తేల్చేసింది .
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications