నోటుకు ఓటు కేసు: సండ్రపై గన్‌మన్ ఏం చెప్పాడు?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య పూర్తిగా ఇరికిపోయినట్లే కనిపిస్తున్నారు. శానససభ్యుల కొనుగోలు కోసం ప్రయత్నించిన నాలుగు రోజుల పాటు సండ్ర కదలికలపై ఆయన గన్‌మన్ నుంచి తెలంగాణ ఎసిబి వివరాలు సేకరించింది.
స్టీఫెన్‌సన్ వ్యవహారంలో సండ్ర మే 27నుంచి 30వరకు ఎక్కడెక్కడ తిరగారు? ఎవరెవరిని కలిశారు? అన్న కోణంలో ఏసీబీ అధికారులు ఆయన గన్‌మెన్‌తో పాటు పీఎస్‌వో, మరో వ్యక్తిని విచారించారు. వారి వాంగ్మూలాలను కూడా రికార్డు చేసినట్టు ఏసీబీ రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపింది.
మీడియా కథనాల ప్రకారం - స్టీఫెన్‌సన్‌కు ఇరవై ఏండ్లుగా పరిచయస్తుడైనా ఆంటోనీని సెబాస్టియన్ మే 28న సంప్రదించాడు. స్టీఫెన్‌సన్‌ను తనకు పరిచయం చేయాలని ఆంటోనీని సెబాస్టియన్ కోరాడు. దీనితో సెబాస్టియన్‌ను స్టీఫెన్‌సన్ ఇంటికి తీసుకెళ్లి ఆయన్ను పరిచయం చేశాడు. అయితే సెబాస్టియన్ సండ్రకు చెప్పినట్టు ఆంటోనీ ద్వారా స్టీఫెన్‌సన్‌ను పరిచయం చేసుకొని కొనుగోలు వ్యవహారం ప్రారంభించాడని ఏసీబీ రిమాండ్ డైరీలో తెలిపింది.

ఎమ్మెల్యే సండ్ర గన్‌మెన్ పీ లచ్చును కూడా ఏసీబీ అధికారులు విచారించి, స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. 29న వెంకట వీరయ్య మహానాడుకు హాజరయ్యారని, మరునాడు 30న ఉదయం 9గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి, అక్కడినుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వెళ్లారని లచ్చుతన వాంగ్మూలంలో చెప్పారు.
అదే రోజు మధ్యాహ్నం 2గంటలకు చంద్రబాబును ఆయన క్యాంప్ ఆఫీస్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌కు వెళ్లి కలిసినట్టు లచ్చు తెలిపాడు. సాయంత్రం 6గంటలకు నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారని, ఆ హోటల్లో టీడీపీ ముఖ్యనాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి ఉన్నారని, 31వ తేదీ సాయంత్రం 5గంటలకు చంద్రబాబు ఇంటికి సండ్ర బయలుదేరారని చెప్పాడు. అదే సమయంలో సండ్రకు ఓ ఫోన్ వచ్చిందని, రేవంత్ అరెస్ట్ విషయం తెలిసి ఏసీబీ కార్యాలయం వద్ద ధర్నాకు ఆయన వెళ్లారని లచ్చు చెప్పారు.












Click it and Unblock the Notifications