రాద్ధాంతం వద్దు నీదా కాదా, టెర్రరిస్ట్‌లా: బాబును దులిపిన వీహెచ్
హైదరాబాద్: టేపుల్లో ఉన్నది తన వాయిస్ కానప్పుడు చంద్రబాబు ఎందుకు అంత రాద్దాంతం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందన్న చంద్రబాబు వ్యాఖ్యలు టెర్రరిస్టులు మాట్లాడినట్లుగా ఉందన్నారు.
తీవ్రవాదులు మాటల్లాడినట్లు,
కేంద్రం నుండి ఇప్పటి వరకు తెలంగాణకు ఒక్క రూపాయి తేలేదని షబ్బీర్ అలీ అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి తప్పు చేసినా శిక్ష పడాల్సిందేనని చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా కోసం కృషి చేయాలన్నారు.
కేసీఆర్ కేబినెట్లో మహిళలకు చోటు లేకుండా పోయిందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పిందొకటి, ఇప్పుడు చేస్తోంది మరొకటి అన్నారు. తప్పు చేస్తే చంద్రబాబు అయినా, మరెవరైనా శిక్షార్హులేనని చెప్పారు.

సెక్షన్ 8 పైన కేసీఆర్ డొంక తిరుగుడు: రాజారాం యాదవ్
సెక్షన్ 8ను కేసీఆర్ వక్రీకరిస్తున్నారని టీడీపీ నేత రాజారామ్ యాదవ్ మండిపడ్డారు. హైదరాబాదులో ఉన్న మైనార్టీల రక్షణ కోసం సెక్షన్ 8 చట్టం మొత్తం చేయించింది తానేనని చెప్పుకున్న కేసీఆర్, ఇప్పుడు సెక్షన్లు చెల్లవని డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారన్నారు. తమ ఎమ్మెల్యేల ఫిర్యాదు పైన ఎసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ విభజన అసంబద్ధంగా: గవర్నర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌ను అసంబద్ధంగా విభజించారని కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం నాడు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications