'జగన్ జగతి కోసం బెదిరించారు, కుట్రలో సాయిరెడ్డి కీలకం, తిరిగివ్వమన్నా'

వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులను రాబట్టడంలో జరిగిన కుట్రలో ప్రధాన నిందితుడైన జగన్‌తో రెండో నిందితుడు విజయ సాయి రెడ్డి కీలకపాత్ర పోషించారని సిబిఐ తెలిపింది.

హైదరాబాద్: వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులను రాబట్టడంలో జరిగిన కుట్రలో ప్రధాన నిందితుడైన జగన్‌తో రెండో నిందితుడు విజయ సాయి రెడ్డి కీలకపాత్ర పోషించారని సిబిఐ తెలిపింది.

బెదిరించి పెట్టుబడులు

బెదిరించి పెట్టుబడులు

బలవంతంగా, ప్రలోభపెట్టి, బెదిరించి పెట్టుబడులను రాబట్టారని, వీటన్నింటికి ఆధారాలు ఉన్నాయని, సాక్షుల స్టేట్‌మెంటులు ఉన్నాయని సిబిఐ కోర్టుకు తెలిపింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో తన పేరును తొలగించాలంటూ విజయ సాయి రెడ్డి వేసిన పిటిషన్‌లో సిబిఐ.. ఇటీవల సిబిఐ ప్రధాన కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.

సమస్యలు ఉండొద్దంటే పెట్టుబడులే మార్గమని

సమస్యలు ఉండొద్దంటే పెట్టుబడులే మార్గమని

జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ పెట్టుబడిదారులనువిజయ సాయి రెడ్డి బెదిరించారని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యాపారం (రిస్క్‌ ఫ్రీ బిజినెస్‌) చేసుకోవాలనుకుంటే జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి తీరాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొంది.

జగన్‌తో కుమ్మక్కు, ఒత్తిడి తెచ్చి ఎక్కువ విలువను లెక్కించి

జగన్‌తో కుమ్మక్కు, ఒత్తిడి తెచ్చి ఎక్కువ విలువను లెక్కించి

క్విడ్‌ ప్రో కో కేసులో జగన్‌తో విజయ సాయి రెడ్డి కుమ్మక్కయ్యారని సిబిఐ పేర్కొంది. విజయ సాయి రెడ్డి జగతి పబ్లికేషన్స్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఉన్నారని, 2007లో పలువురితో పెట్టుబడులు పెట్టించారని సిబిఐ పేర్కొంది. డెలాయిట్‌కు చెందిన సుదర్శన్‌పై ఒత్తిడి తెచ్చి ఎక్కువ విలువను లెక్కగట్టించి పెట్టుబడిదారులను మోసం చేశారని పేర్కొంది.

జయలక్ష్మి టెక్స్‌టైల్స్‌కు బెదిరింపు

జయలక్ష్మి టెక్స్‌టైల్స్‌కు బెదిరింపు

రిస్క్‌ ఫ్రీ బిజినెస్‌ చేసుకోవాలంటే ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్‌ కంపెనీలో రూ.5 కోట్లు పెట్టుబడిగా పెట్టాలంటూ జయలక్ష్మి టెక్స్‌టైల్స్‌కు చెందిన టీఆర్‌ కణ్ణన్‌ను బెదిరించారని పేర్కొన్నారు.

పెట్టుబడి తిరిగివ్వమంటే నో చెప్పారు

పెట్టుబడి తిరిగివ్వమంటే నో చెప్పారు

మరో పెట్టుబడిదారుడు మాధవ రామచంద్రన్‌తోనూ పెట్టుబడి పెట్టించారని, వీరిద్దరితో రూ.24.65 కోట్లు జగతి పబ్లికేషన్స్‌లో పెట్టిబడులు పెట్టించి వారికి నష్టం చేశారని సిబిఐ పేర్కొంది. మాధవ రామచంద్రన్‌ పెట్టుబడి మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని సిబిఐ పేర్కొంది.

విజయసాయి రెడ్డి రాజీనామా చేసినా..

విజయసాయి రెడ్డి రాజీనామా చేసినా..

2007లో డైరెక్టర్‌ పదవికి విజయ సాయి రెడ్డి రాజీనామా చేసినా పెట్టుబడులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారని సిబిఐ పేర్కొంది. ఆయనపై అభియోగాలను నిరూపించేందుకు అన్ని ఆధారాలూ తమ వద్ద ఉన్నాయని తెలిపింది. ఈ పిటిషన్‌ను ఈ నెల 8న ప్రత్యేక కోర్టు విచారించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+