బాహుబలి-2 థియేటర్లపై.. సెన్సార్ బోర్డు దాడులు! అదే కారణమా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బాహుబలి-2 సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లో కొన్ని థియేటర్లలో నిబంధలనకు విరుద్ధంగా గురువారం మూవీ ప్రీ రిలీజ్ షోలు ప్రదర్శిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న సెన్సార్ బోర్డు సభ్యులు కొందరు ఎల్బీనగర్ లోని విజయలక్ష్మి థియేటర్‌పై దాడులు నిర్వహించారు. నిబంధనలను విరుద్ధంగా బాహుబలి-2 ప్రదర్శిస్తున్నారని బోర్డు అధికారులు అడ్డుకున్నారు.

Bahubali-2

ఈ క్రమంలో థియేటర్ యాజమాన్యానికి, సెన్సార్ బోర్డు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ ఒక్క థియేటరే కాదు, సెన్సార్ బోర్డు సభ్యులు మరికొన్ని థియేటర్లపైనా దృష్టి పెట్టారు.

బోర్డు సభ్యులపై విజయలక్ష్మి థియేటర్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. మరోవైపు విజయలక్ష్మి థియేటర్ కాంప్లెక్స్ వద్ద బీజేవైఎం ఆందోళన చేపట్టింది. బాహుబలి-2 ప్రీ రిలీజ్ షో నిలిపి వేయాలంటూ థియేటర్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు.

థియేటర్ వద్ద గొడవ జరుగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు తీసుకున్నారు.

పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి-2 చిత్రాన్ని రేపు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా 9వేల స్క్రీన్లపై ప్రదర్శించబోతున్న విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad: Some of the Censor Board Members conducted raid on Vijayalakshmi Theatre which is located at LB Nagar on Thursday Night after getting information about the Bahubali 2 Pre Release Shows are exhibiting in the Theatre. Not only this theatre, they are going to raid some more theatres also.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి