సామాన్యులకు పండుగలాంటి వార్త చెప్పిన కేంద్రం.. ఆ ధరల తగ్గింపు

సామాన్య ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ధరలపెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు వంట నూనె ధరల తగ్గింపుతో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ దిగుమతి సుంకాలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో సామాన్య మధ్యతరగతి ప్రజల నెత్తిన పాలు పోసినట్లయింది.

క్రూడ్ ఆయిల్స్ పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 20 శాతం నుంచి 10 శాతానికి
క్రూడ్ పామ్ ఆయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్ ల పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి వచ్చిందని ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు. ఇది దేశీయ రిఫైనింగ్ పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తుందని, వంట నూనెల వినియోగదారులకు కూడా ఇది ఊరటనిచ్చే అంశమని ఆయన పేర్కొన్నారు.

center said good news that price reduction 0n edible oil prices

తగ్గనున్న నూనె ధరలు
భారతదేశం దాదాపు 50 శాతం వంట నూనెల కోసం విదేశీ దిగుమతుల పైన ఆధారపడింది. గతంలో దిగుమతి సుంకాలు పెంచిన సమయంలో నూనె ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు దిగుమతి సుంకాలు తగ్గించడంతో నూనె ధరలు కూడా తగ్గుతాయని అందరూ అంచనా వేస్తున్నారు. భారతదేశం పామాయిల్ ను ముఖ్యంగా మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.

సామాన్యులకు రిలీఫ్ ఇచ్చేలా వంటనూనెల ధరలు
ఈ క్రూడాయిల్ పైన భారతదేశ సుంకం తగ్గించిన తర్వాత దేశంలో వీటి ధరల పైన కూడా ప్రభావం పడుతుంది. దిగుమతులు సుంకం తగ్గడంతో ధరలలో కూడా మార్పు చోటుచేసుకుని నూనె రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇది సామాన్యులకు కాస్త రిలీఫ్ ఇచ్చే అంశం.

క్రూడ్ ఆయిల్స్‌పై డ్యూటీ తగ్గించిన కేంద్రం
కాగా గత సంవత్సరం సెప్టెంబర్ 14న కేంద్రం క్రూడ్ ఆయిల్స్‌పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 0 శాతం నుండి 20 శాతానికి పెంచింది. అంతేకాదు రిఫైన్డ్ ఆయిల్స్‌పై డ్యూటీని 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెంచింది. దీని ఫలితంగా ప్రజల్లో రిఫైన్డ్ ఆయిల్స్ పైన ఆసక్తి పెరిగింది. తక్కువ ధరకే లభించే రిఫైన్డ్ ఆయిల్స్ దిగుమతులు ఊపందుకున్నాయి. కానీ ఇప్పుడు తిరిగి క్రూడ్ ఆయిల్స్‌పై డ్యూటీ తగ్గించడంతో మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+