తెలంగాణా గ్రామాలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.247.9 కోట్ల విడుదల

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలకు పైగా గ్రాంట్ లను విడుదల చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి ఈ సందర్భంగా కేంద్రం తీపి కబురు చెప్పింది.

తెలంగాణాకు 247.9 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి 247.9 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని 12 వేల 600 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడంతో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీల అభివృద్ధి త్వరితగతిన జరగడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అయింది.

center said Good news to telangana released 247 9 crore as the first installment of untied grants

అన్‌టైడ్ గ్రాంట్స్ నుంచి నిధులు

2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దిష్ట వినియోగ నిబంధనలు లేని నిధులు- అన్‌టైడ్ గ్రాంట్స్ నుంచి 247.94 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసింది. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అన్ టైడ్ గ్రాండ్స్ కింద ఈ నిధులను కేటాయించింది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలకు కలిపి మొత్తం 1500 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయగా, అందులో తెలంగాణకు ప్రత్యేక ప్రాధాన్యత లభించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన

ఈ నిధులతో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. క్షేత్రస్థాయిలో పాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామసభలు నిర్ణయించిన గ్రామాల పరిధిలోని వివిధ పనులకు ఈ నిధులను ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుంది.

గ్రామాలలో ముఖ్యంగా చేసే పనులు ఇవే

ముఖ్యంగా గ్రామాలలో అంతర్గత రోడ్ల నిర్మాణం, మురికినీటి కాలువల మరమ్మత్తులు, వీధి దీపాలను ఏర్పాటు చేయడం, స్మశాన వాటికల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. పల్లె సీమలే దేశానికి పట్టు కొమ్మలు కావటంతో గ్రామాల ప్రగతి రాష్ట్ర ప్రగతికి, దేశ ప్రగతికి దోహదం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+