
తెలంగాణాకు కేంద్రం షాక్: సింగరేణి ఆ బ్లాకులలో బొగ్గు అన్వేషణ కోసం 66 కోట్లు ఖర్చు; అయినా వేలం జాబితాలో
దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో ప్రస్తుతం దేశం దృష్టి సింగరేణి మైన్స్ పై పడింది. దేశవ్యాప్తంగా విద్యుత్తుకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో, ఆ డిమాండ్ ను తీర్చడం కోసం బొగ్గు తవ్వకాలను పెంచే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. అయితే దేశం మొత్తం బొగ్గు కొరత ఉన్నా ఒక్క తెలంగాణాలోనే బొగ్గు నిల్వల సమస్య కాస్త తక్కువగా ఉంది. మరో పక్క తెలంగాణా కూడా తమకు విద్యుత్ కొరత లేదని ఇప్పటికే ప్రకటన చేసింది. తెలంగాణలో బొగ్గు గనులు ఉండటంతో బొగ్గు కొరత లేదు. ఈ సమయంలో కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయం తెలంగాణా సింగరేణికి షాక్ ఇచ్చేలా ఉంది.

తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన బొగ్గు గనుల వేలం ప్రకటన
దేశవ్యాప్తంగా
88
బొగ్గు
బ్లాకుల
వేలం
పై
ఇటీవల
కేంద్రం
ప్రకటనను
విడుదల
చేసింది.
ఈ
వేలం
ప్రకటన
ప్రస్తుతం
తెలుగు
రాష్ట్రాల్లో
చర్చనీయాంశంగా
మారింది.
ముఖ్యంగా
తెలంగాణాకు
ఈ
ప్రకటన
షాక్
ఇచ్చింది.
కేంద్రం
ఇటీవల
ప్రకటించిన
బొగ్గు
బ్లాకుల
వేలంలో
ఇప్పటికే
సింగరేణి
బొగ్గు
లభ్యతపై
అన్వేషణ
సాగిస్తున్న
తెలంగాణా
బ్లాకులు
కూడా
ఉండటం
సింగరేణి
వర్గాలలో
చర్చనీయాంశంగా
మారింది.
కోల్
మైన్స్
స్పెషల్
ప్రొవిజన్స్
యాక్ట్
2015,
మైన్స్
మరియు
మినరల్స్
యాక్ట్
1957
ప్రకారం
బొగ్గు
బ్లాకులను
వేలం
వేస్తున్నట్లు
కేంద్రం
ప్రకటించింది.
దీనిలో
మహారాష్ట్ర,
మధ్యప్రదేశ్,
అరుణాచల్
ప్రదేశ్,
పశ్చిమ
బెంగాల్,
చతిస్గడ్,
ఒడిశా,
ఝార్ఖండ్
,
అస్సాం,
రాష్ట్రాల్లోని
బ్లాక్
లతో
పాటు
ఆంధ్ర
ప్రదేశ్,
తెలంగాణ
రాష్ట్రానికి
చెందిన
బొగ్గు
గనులు
ఉన్నాయి.

సింగరేణి బొగ్గు అన్వేషణ సాగిస్తున్న బొగ్గు బ్లాకులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం
అయితే కేంద్ర జాబితాలో వేలం వేస్తున్నట్లు ప్రకటించిన బ్లాకులు ప్రస్తుతం సింగరేణి పరిధిలో బొగ్గు అన్వేషణ సాగిస్తున్నాయి. వాటి కోసం సింగరేణి ఇప్పటివరకు నిధులను సైతం ఖర్చు పెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం బ్లాక్ 3, ఖమ్మం జిల్లా సత్తుపల్లి బ్లాక్ 3, మంచిర్యాల జిల్లా కళ్యాణఖని బ్లాక్ 6, శ్రావణ పల్లి లోని ఓ బ్లాక్ లను వేలం వేయడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం సింగరేణికి షాక్ అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సోమవరం వెస్ట్ బ్లాక్ కూడా కేంద్రం ప్రకటించిన జాబితాలో ఉండటం గమనార్హం. తెలంగాణలో బొగ్గు లభ్యతపై అన్వేషణ కోసం సింగరేణి ఇప్పటివరకూ చాలా డబ్బు ఖర్చు చేసింది.

సింగరేణి పరిధిలో లేని బ్లాక్ లపై బొగ్గు అన్వేషణ .. కేంద్రానికి తెలిసే ఇదంతా..
కేంద్రం ప్రస్తుతం జాబితా ప్రకటించిన బ్లాక్ ల కోసం కూడా నిధులను ఖర్చు పెట్టింది. సత్తుపల్లి బ్లాక్ 3లో ఎనిమిది కోట్లు, కోయగూడెం ఓసీ 3 లో 18 కోట్లు, శ్రావణ పల్లి లో 20 కోట్లు, మంచిర్యాల కేకే 6 లో 20 కోట్లు ఖర్చు చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు 66 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తూ వచ్చింది. అంతేకాదు ఏడాదికి 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ సింగరేణి బొగ్గు అన్వేషణ సాగిస్తోంది.

లీజ్ లో లేని బ్లాకుల్లో సింగరేణి బొగ్గు అన్వేషణ సాగించినా కేంద్రం ఎందుకు కొనసాగించింది ?
సింగరేణి పరిధిలో లేని బ్లాకులలో తెలంగాణా సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అన్వేషణ ఎలా సాగించింది? ఇక ఈ విషయం తెలిసి కూడా కేంద్రం ఎలా దీనిని కొనసాగించింది అన్నది ఒక ప్రశ్న. తెలంగాణా సింగరేణి తమ పరిధిలో లేని బ్లాకుల్లో బొగ్గు అన్వేషణ చేస్తున్న సమయంలో ఒకే అన్నట్టు మౌనంగా ఉన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ, ఇప్పుడు దేశం బొగ్గు కొరతలో ఉన్న సమయంలో షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కేంద్రం లీజుకు ఇస్తానని ప్రకటించిన బ్లాక్ లు సింగరేణి పరిధిలో లేవని, ఈ కారణంగానే కేంద్రం వేలంలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. బొగ్గు అన్వేషణ సాగించిన సింగరేణికి షాక్ ఇచ్చింది.

ఆ మైన్స్ దక్కించుకోవటం కోసం ప్రైవేట్ సంస్థలతో పోటీ పడాల్సిన పరిస్థితి అర్ధం ఏమిటి?
లీజ్ నిర్ణయంతో ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధుల మాట అటుంచి వాటిని దక్కించుకోవటం కోసం సింగరేణి కూడా ప్రైవేట్ సంస్థలతో పోటీ పడాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటివరకు సింగరేణి ఈ బ్లాక్ లపై డబ్బు ఖర్చు చేయడంతో, సింగరేణి ఖర్చు చేసిన డబ్బులను వేలం దక్కించుకున్న సంస్థల నుంచి తిరిగి రాబట్టుకోవాల్సి ఉంటుంది. తమ పరిధిలో లేని బ్లాకులపై బొగ్గు అన్వేషణకు డబ్బు ఖర్చు చేసిన సింగరేణి ఒకవేళ లీజ్ లో ఆ బ్లాకులు దక్కించుకోలేకపోతే ప్రైవేట్ సంస్థల నుండి ఆ డబ్బు తిరిగి రాబట్టుకోవాలని సూచించటంపై సింగరేణి వర్గాల్లో చర్చ జరుగుతుంది.
Recommended Video

తెలంగాణా సర్కార్ కు షాక్ ఇవ్వటం కోసమే ఆ బ్లాకులు లీజుకు.. ఆసక్తికర చర్చ
సింగరేణి కాలరీస్ అటు కేంద్ర మరియు తెలంగాణా ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్రం ఇవ్వాలి అనుకుంటే ఈ బ్లాకుల లీజ్ కూడా సింగరేణికి ఇవ్వొచ్చు. కానీ తెలంగాణా సర్కార్ కు షాక్ ఇవ్వటం కోసమే ఈ బ్లాకుల లీజ్ ఇవ్వటానికి వేలం లిస్టులో చేర్చినట్టు చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా సింగరేణి బొగ్గు ఉత్పత్తి కోసం ప్రయత్నం చేస్తున్న, అన్వేషణ సాగిస్తున్న బ్లాకులను కేంద్రం వేలం లిస్టులో ప్రకటించడం ప్రస్తుతం తెలంగాణలో ఆసక్తికర అంశంగా మారింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత తీవ్రంగా నెలకొన్న సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం కోల్ బెల్ట్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.