తెలంగాణ ఆవిర్భావం తర్వాత పెరిగిన అప్పులు: 2014-15 నుంచి పెరిగియి ఇలా

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు భారీగా పెరిగాయని తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు భారీగా పెరిగాయని తెలిపారు. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

తెలంగాణ ఆవిర్భావం నుంచి పెరుగుతూ వచ్చిన అప్పులు

తెలంగాణ ఆవిర్భావం నుంచి పెరుగుతూ వచ్చిన అప్పులు

తెలంగాణ ఆవిర్భావం నాటికి 75,577 కోట్ల అప్పులున్నాయని కేంద్రం తెలిపింది. అవి 2021-22 నాటికి అవి 2.83 లక్షల కోట్లకు చేరాయని పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు లక్షా 50 వేల కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలిపింది. 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు లక్షా 30 వేల కోట్లని వివరించింది. 2022 అక్టోబర్ నాటికి తెలంగాణ రాష్ట్రానికి 4,33,817.6 కోట్ల అప్పు ఉన్నట్లు వెల్లడించారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత చేసిన అప్పులు ఇలా

తెలంగాణ ఆవిర్భావం తర్వాత చేసిన అప్పులు ఇలా

2014-15లో రూ. 8,121 కోట్లు

2015-16లో రూ. 15,515 కోట్లు
2016-17లో రూ. 30,319 కోట్లు
2017-18లో రూ. 22,658 కోట్లు
2018-19లో రూ. 23,091 కోట్లు
2019-20లో రూ. 30,577 కోట్లు
2020-21లో రూ. 38,161 కోట్లు
2021-22లో రూ. 39,433 కోట్లుగా ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలు రుణాలు ఇలా

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలు రుణాలు ఇలా

అంతేగాక, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు కేంద్ర ఆర్థిక శాఖకు నివేదించాయి. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి రూ. 8871 కోట్లు మంజూరు కాగా, రూ. 7144 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. వేర్‌హౌస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి రూ. 972 కోట్లు మంజూరు కాగా, రూ. 10 కోట్లు విడుదలయ్యాయి.నాబార్డ్ ఇన్ఫ్ట్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ నుంచి వివిధ పథకాల అమలు కోసం రూ. 14,516.65 కోట్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 11,424.66 కోట్లు వినియోగించుకున్నట్లు కేంద్రం తన లిఖితపూర్వకంగా సమాధానంలో వెల్లడించింది. కాగా, ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో కూడా అప్పుల వివరాలను ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+