డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త!

రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి పైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో రైల్వేను పురోగతి బాటలో ముందుకు నడిపించేందుకు తన వంతుగా కృషి చేస్తోంది. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రైల్వే అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పథకం కింద రాష్ట్రంలోని 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు.

తెలంగాణాలో రైల్వే ఆధునీకరణ పనులు

అత్యాధునికంగా రైల్వే స్టేషన్లను మారుస్తున్నారు. ఆధునిక వెయిటింగ్ హాల్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు. మెరుగైన పార్కింగ్ వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇదే కాదు కొత్త రైల్వే లైన్ లను ఏర్పరుస్తూ వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లోక్సభలో ఎంపీ మల్లు రవి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

central govt announced good news for Telangana minister said 296 km Dornakal Gadwal new railway line

డోర్నకల్ గద్వాల కొత్త రైల్వే లైన్ పై మంత్రి ప్రకటన

డోర్నకల్ - గద్వాల మధ్య ప్రతిపాదించిన కొత్త 296కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణంపైన ప్రశ్నించగా, డోర్నకల్- గద్వాల మధ్య రైల్వే లైనుకు సర్వే పూర్తయిందని సమాధానం ఇచ్చారు. ఈ మార్గం సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల మీదుగా సాగుతుందని, డిపిఆర్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం, నీతిఆయోగ్, ఆర్థిక శాఖలతో సంప్రదించి ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుభవార్త చెప్పారు.

జడ్చర్ల నంద్యాల మధ్య పూర్తయిన సర్వే

ఏపీ, తెలంగాణ ప్రయాణికుల కోసం జడ్చర్ల నంద్యాల మధ్య 102కిలోమీటర్ల కొత్త సర్వే పూర్తయిందని కూడా ఆయన ప్రకటించారు. ఈ ప్రాజెక్టును కూడా త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఏపీ తెలంగాణ మధ్య రైల్వే లైన్ల పనులపైన మాట్లాడిన రైల్వే మంత్రి పలు రైల్వే లైన్ల భూసేకరణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ రైల్వే లైన్ల ఆలస్యానికి కారణం చెప్పిన మంత్రి

గుంటూరు బీబీనగర్ డబ్లింగ్, కాజీపేట విజయవాడ మూడవ లైన్ ముద్ ఖేడ్ - మేడ్చల్, మహబూబ్ నగర్ డోన్ డబ్లింగ్, మనోహరాబాద్ కొత్తపల్లి కొత్త రైల్వేలైన్ల వంటి ప్రాజెక్టుల ఆలస్యానికి భూసేకరణలో జరుగుతున్న జాప్యమే కారణమన్నారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో ఎంపికైన 40స్టేషన్లలో ఆరు స్టేషన్ల ఆధునీకరణ పూర్తయిందని తెలిపారు. వరంగల్, కరీంనగర్, రామగుండం, జోగులాంబ గద్వాల్, బేగంపేట, హఫీజ్ పేట స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.

ఎంఎంటీఎస్ రైళ్ళపై మంత్రి క్లారిటీ

హైదరాబాద్ లో సికింద్రాబాద్, ఘట్కేసర్, చర్లపల్లి మధ్య మొత్తం 55 ఎంఎంటీఎస్ రైళ్ళు నడుస్తున్నాయని సికింద్రాబాద్ చర్లపల్లి మార్గంలో 39 రైళ్లు, మిగిలినవి చర్లపల్లి ఘట్కేసర్, సికింద్రాబాద్ ఘట్కేసర్ సెక్షన్లలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. కొత్త ఎంఎంటీఎస్ రైళ్ల విస్తరణ అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్ లపై ప్రకటన

కొత్త ఎంఎంటీఎస్ విస్తరణ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రకటించారు. వాటిని త్వరలోనే పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+