వరద నష్టంపై వరంగల్ లో కేంద్ర బృందం పర్యటన; మొత్తం షెడ్యూల్ ఇలా !!
భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న వరద ప్రభావిత ప్రాంతాలను జరిగిన నష్టం అంచనా వేయడానికి కేంద్ర బృందం రంగంలోకి దిగింది. సహజంగా వర్షాలు వరదలు అనంతరం నష్టాన్ని అంచనా వేసి నివేదికను కేంద్రానికి పంపిస్తే కేంద్ర బృందం నష్టం జరిగిన ప్రాంతాలలో పర్యటించడం ఆనవాయితీ.
కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటిస్తుంది. గతేడాది కూడా కేంద్ర బృందం నివేదికకు ముందే పర్యటించింది. అయితే ప్రస్తుతం కేంద్ర బృందం పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయినప్పటికీ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు రాష్ట్రానికి కేంద్ర బృందం వచ్చింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన కేంద్ర అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఎన్డీఎంఏలో సంయుక్త కార్యదర్శి కునాల్ సత్యార్ధి ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆర్ధిక, రోడ్డు రవాణా, జలశక్తి, వ్యవసాయశాఖల అధికారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ అథారిటీ కి చెందిన సభ్యులు ఈ బృందంలో ఉన్నారు.
వర్షాలు, వరదల నష్టంపై వరంగల్ లో కేంద్ర బృందం పర్యటన#WarangalRains #TelanganaRains #Rains #TelanganaNews #Oneindiatelugu pic.twitter.com/oEkGQkH1r2
— Goodreturns Telugu (@GoodreturnsTe) August 1, 2023
మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఈ బృందం పర్యటిస్తుంది. ఈ బృందం ఈ మధ్యాహ్నం వరంగల్ నగరానికి చేరుకుంది. వరంగల్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితుల ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరద నష్టం పై జిల్లా అధికారులు కేంద్ర బృందానికి నివేదికలను అందించారు. నేడు వరంగల్ జిల్లాలో వరద పరిస్థితులను, వాటిల్లిన అపార నష్టాన్ని కేంద్ర బృందం నేరుగా పరిశీలించి అంచనా వెయ్యనుంది.
రేపు భూపాల పల్లి జిల్లా, మోరంచపల్లి గ్రామాన్ని కేంద్ర బృందం సందర్శిస్తుంది. ఎల్లుండి ములుగు జిల్లాలోని కొండాయి గ్రామాన్ని, భద్రాచలం పట్టణాన్ని సందర్శిస్తుంది. అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతుంది. ఇదిలా ఉంటే వర్షాలు, వరదల వల్ల చోటు చేసుకున్న వివిధ సంఘటనల్లో 40 మందికి పైగా మరణించారని, 27వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications