హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో జీవవైద్య పరిశోధన కేంద్రం: రూ. 338కోట్లతో ఆమోదం తెలిపిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలోని జినోమ్‌ వ్యాలీలో రూ.338.58 కోట్ల వ్యయంతో 'జీవ వైద్య పరిశోధనలకు జాతీయ వనరుల వ్యవస్థ'(ఎన్‌ఏఆర్‌ఎఫ్‌) పేరుతో పరిశోధన-అభివృద్ధి కేంద్రం ఏర్పాటు కానుంది. కేంద్ర కుటుంబ సంక్షేమం-ఆరోగ్య మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించింది.

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ కేంద్రం ఏర్పాటుపైనే కాకుండా అనేక ఇతర నిర్ణయాలు తీసుకున్నారు. ఇలాంటి కేంద్రం ఏర్పాటు కావడం దేశంలోనే ప్రథమం కావడం గమనార్హం.

వైద్య అవసరాల నిమిత్తం రకరకాల పరిశోధనలకు జంతు వనరుల్ని సమకూర్చడానికి ఈ కేంద్రాన్ని ఉద్దేశిస్తున్నారు. ప్రపంచశ్రేణి సదుపాయాలతో భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసిఎంఆర్‌) ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రం 2018-19 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుంది.

Centre gives nod for Rs 338 cr bio-medical research centre in city

వైద్య కళాశాలలు, పరిశోధన, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఔషధ కంపెనీలకు ఉపయోగపడేలా జీవవైద్య పరిశోధనల నిమిత్తం జంతువుల్ని ఈ కేంద్రం సిద్ధం చేస్తుంది. నిపుణులకు అవసరమైన శిక్షణను కూడా అందిస్తుంది. ఎన్‌ఎఆర్‌ఎఫ్‌ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం 102.69 ఎకరాల స్థలాన్ని జినోమ్‌వ్యాలీలో ఉచితంగా కేటాయించింది.

జినోమ్‌వ్యాలీలో ఏర్పాటయ్యే పరిశోధన కేంద్రం విస్తృత పరీక్షలకు నిలయంగా నిలుస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖలోని ఆరోగ్య పరిశోధన విభాగం సంయుక్త కార్యదర్శి మనోజ్‌ పంత్‌ మీడియాకు తెలిపారు.

జంతువులపై పరీక్షలను వ్యతిరేకించే మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ నుంచి అడ్డంకులేమీ రాలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. ఇలాంటి సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల పరిశోధన-అభివృద్ధి వ్యయం 60% మేర తగ్గిపోతుందన్నారు.
ఉత్పత్తి వ్యయంలోనూ 30% ఆదా అవుతుందని వివరించారు.

ఎలాంటి రోగకారక జీవులు లేని అన్ని రకాల జంతువులు పరీక్షల నిమిత్తం ఇక్కడ దుబాటులో ఉంటాయనీ, ఇంతవరకు దేశంలో ఎక్కడా ఇలాంటి సదుపాయం లేదనీ ఐసిఎంఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ శర్మ చెప్పారు.

దాదాపు 250 కంపెనీలు ఇలాంటి సదుపాయాలను వాడుకోవడంపై ఆసక్తితో ఉన్నాయని వివరించారు. విదేశాలతో పోలిస్తే భారత్‌లో జంతువుల ఖరీదు, ప్రయోగాలకయ్యే ఖర్చు చాలా తక్కువని చెప్పారు. నేపాల్‌, సింగపూర్‌ వంటి చిన్నదేశాల్లోనూ ఇలాంటి సదుపాయాలున్నాయని తెలిపారు.

English summary
A National Resource Facility for Bio-medical Research (NARF) will be set up here by the Indian Council for Medical Research (ICMR).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X