హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగల చోరీ: పోలీసులమని.. మాయమాటలతో...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోలీసునని మాయమాటలు చెప్పి మహిళ వద్ద బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన హైదరాబాదులోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎన్‌జివో కాలనీలో నివసించే రామలక్ష్మీ వద్దకు ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి వచ్చి పోలీసునని పరిచయం చేసుకున్నాడు.

దొంగతనాలు జరుగుతున్నాయి, నగలు జాగ్రత్త చేసుకోవాలని మెడలో ఉన్న మూడు తులాల బంగారు నగలు తీయించి సంచిలో భద్రపర్చాలని చెప్పాడు. అతడు వెళ్లిన తర్వాత సంచిలో చూస్తే రాళ్లు కనిపించాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

డుచుకుంటూ వెళ్తున్న మహిళకు మాయమాటలు చెప్పి బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఉత్తంనగర్‌లో నివసించే శాంతకుమారి (77) శనివారం రాత్రి కూతురితో కలసి సఫిల్‌గూడ నుండి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఉత్తంనగర్ రైల్వే వంతెన వద్ద గుర్తుతెలియని ఇద్దరు దుండగులు వారిని పిలిచి ఎదురుగా గొడవ జరుగుతోందని చెప్పి వారివద్ద ఉన్న నగలు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు.

Chain snatching incidents in Hyderabad

వారి వద్ద ఉన్న రెండు బంగారు గొలుసులు, నల్లపూసల గొలుసు తీసి కాగితంలో పెట్టి ఇచ్చారు. ముందుకు వెళ్లిన తర్వాత నగలు వేసుకుందామని కాగితం విప్పి చూసిన వారికి అందులో ఇసుక ఉండటంతో గొల్లుమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మహిళ దృష్టి మళ్లించి ఆమె మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ మండలం పరిధిలోని నూతన్‌కల్ గ్రామానికి చెందిన బాలమణి (45) ఉప్పల్ ఆదర్శనగర్‌లో ఉంటున్న బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్‌కు రావడానికి ఆదివారం ఉదయం ఉప్పల్ రింగ్‌రోడ్డులో బస్సు దిగింది. నడుచుకుంటూ వచ్చి ఆటోకోసం శక్తి వైన్‌షాప్ పక్కన నిల్చొంది. ఇంతలోనే ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చారు.

మెడలో కన్పించే విధంగా బంగారు నగలు వేసుకోవద్దని ఉచిత సలహా ఇచ్చి పోలీసులు తిరుగుతున్నారు జాగ్రత్తగా లోపల భద్రంగా పెట్టుకోమని చెబుతూ వారే తీసి ఆమె దృష్టి మళ్లించి సంచిలో వేసినట్టు నటించారు. కొద్ది సేపటికి సంచిలో చూసుకోగా కన్పించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు క్రైం ఇన్‌స్పెక్టర్ వెంకట్ రంగారెడ్డి తెలిపారు.

English summary
gold ornaments were robbed in Hyderabad at Vanasthalipuram, Malkajgiri and Uppal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X