కాలు జారిపడి.. తాజా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి తలకు గాయం
వరంగల్: టీఆర్ఎస్ సీనియర్ నేత, పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తలకు గాయమైంది. స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆయన జారిపడటంతో తల భాగంలో దెబ్బ గట్టిగా తగిలింది.
వెంటనే ఆయనను హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందజేశారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు.

వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ధర్మారెడ్డికి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ధర్మారెడ్డిని పలువురు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పరామర్శించారు.












Click it and Unblock the Notifications