హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీకి చంద్రబాబు-రేపు విద్యార్ధులతో చర్చ..!
ఉమ్మడి ఏపీకి దాదాపు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో అరుదైన గౌరవం లభించింది. తాను సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ ప్రతిష్టాత్మక విద్యాసంస్ధ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటూ తిరిగి ఆయన్ను ఆహ్వానించింది. అదీ హైదరాబాద్ అభివృద్ధికి ఐటీ రూపంలో చంద్రబాబు వేసిన బీజాలు, అవి ఈ సంస్ధ ఆవిర్భావానికి ఎలా పనికొచ్చాయన్న అంశాలపై ఉపన్యాసం ఇచ్చేందుకు ఆహ్వానించింది.
రేపు హైదరాబాద్ లోని ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ మేరకు రేపు ఈ వేడుకలకు రావాలని చంద్రబాబుకు ఆహ్వానం అందింది. దీంతో చంద్రబాబు రేపు హైదరాబాద్ లో ఈ వేడుకలకు హాజరు కానున్నారు. IIIT హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా క్యాంపస్ లో రేపు నిర్వహిస్తున్న ఇంటరాక్షన్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో 1998లో ఐఐఐటీ హైదరాబాద్ ఏర్పాటైంది. ఇందులో ఇప్పటివరకూ వేలాది మంది విద్యార్ధులు పాసవుట్ అయి కీలక ఉద్యోగాల్లో స్ధిరపడ్డారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఐటీల్లో హైదరాబాద్ కూడా గొప్ప సంస్ధగా పేరు తెచ్చుకుంది. ఇందులో చంద్రబాబు కృషి ఉన్న నేపథ్యంలో ఆయనకు రేపటి సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆహ్వనించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications