తెలంగాణాపై చంద్రబాబు మాస్టర్ మైండ్; బీఆర్ఎస్ మంత్రులు, అగ్రనేతల ఉలికిపాటు అందుకే!!

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందా? తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వేగంగా రాజకీయాలను నెరపి, వచ్చే ఎన్నికల బరిలోకి దిగితే అధికార బి ఆర్ ఎస్ కు ఇబ్బంది ఎదురవుతుందా? బీజేపీతో పొట్టు కోసం బాబు వ్యూహంలో ఇది భాగమా? మూకుమ్మడిగా తెలంగాణ మంత్రులు, అగ్రనాయకులు చంద్రబాబును, టిడిపిని టార్గెట్ చేయడం వెనుక కారణం అదేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది.

చంద్రబాబు ఖమ్మం సభ ఎఫెక్ట్... బాబును టార్గెట్ చేసిన బీఆర్ఎస్ మంత్రులు, అగ్రనేతలు

చంద్రబాబు ఖమ్మం సభ ఎఫెక్ట్... బాబును టార్గెట్ చేసిన బీఆర్ఎస్ మంత్రులు, అగ్రనేతలు

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన, అక్కడ నిర్వహించిన బహిరంగ సభకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ వచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చంద్రబాబు నాయుడును, తెలుగుదేశం పార్టీని తిట్టిపోశారు. హరీష్ రావు, కవిత లాంటి ఆ పార్టీ అగ్ర నాయకులే కాదు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాంటి నాయకులు కూడా చంద్రబాబుపై, తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబును బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేసిన కారణాలు ఇవేనా?

చంద్రబాబును బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేసిన కారణాలు ఇవేనా?

ఇందులో ప్రధానంగా మూడు అంశాలను గమనించాల్సిన అవసరం ఉంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబునాయుడు సభకు పెద్దగా స్పందన లేకపోతే బీఆర్ఎస్ నాయకులు ఇంతగా చంద్రబాబు నాయుడు పై ఫోకస్ చేసే వారు కాదని చర్చ జరుగుతుంది. అంతేకాదు ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్ పార్టీ గురించి గానీ, సీఎం కేసీఆర్ గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినప్పటికీ బి ఆర్ ఎస్ పార్టీ నేతలు చంద్రబాబును, టిడిపిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కోసమే తెలంగాణలో కొత్త రాజకీయం మొదలు పెట్టారని బీఆర్ఎస్ పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తూ, చంద్రబాబును టార్గెట్ చేశారు.

తెలంగాణా పాలిటిక్స్ పై చంద్రబాబు ఫోకస్ అందుకేనా?

తెలంగాణా పాలిటిక్స్ పై చంద్రబాబు ఫోకస్ అందుకేనా?

ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో టిడిపికి క్షేత్రస్థాయిలో ఉన్న బలాన్ని, తెలంగాణ బీజేపీతో పొత్తు పెట్టుకుని వారికి బదిలాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఈక్రమంలోనే ఒక్కసారిగా బి ఆర్ ఎస్ నాయకులు ఉలిక్కిపాటుకు గురయ్యారు. అందుకే పెద్ద ఎత్తున ఆంధ్ర పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకులు లేకపోయినా కార్యకర్తలు, అభిమానులు ఇంకా చాలామంది ఉన్నారు అన్న విషయం మరొకసారి ఖమ్మం సభతో నిరూపించబడింది. బీజేపీతో టిడిపి పొత్తు కోసమే చంద్రబాబు నాయుడు తెలంగాణలో రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నట్లుగా ప్రధానంగా చర్చ జరుగుతోంది.

తెలంగాణాపై చంద్రబాబు ఫోకస్ వెనుక ఫ్యూచర్ ఎలక్షన్ ప్లాన్

తెలంగాణాపై చంద్రబాబు ఫోకస్ వెనుక ఫ్యూచర్ ఎలక్షన్ ప్లాన్

తెలంగాణాలో అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న బిజెపితో, టిడిపి పొత్తు పెట్టుకొని ముందుకు వెళితే, చంద్రబాబు అభిమానులు, టిడిపికి ఎప్పటినుండో ఉన్న ఓటు బ్యాంకు బీజేపీకి మళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ తెలంగాణలో ఖరారైతే, ఏపీ లోని బీజేపీతో పొత్తుకు చంద్రబాబుకు అవకాశం ఉంటుంది. అదే గనుక జరిగితే ఏపీలో చంద్రబాబు జనసేన, బీజేపీ పొత్తు తో వైసీపీపై సమర శంఖం పూరించే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుందని చంద్రబాబు భావిస్తున్నారని చర్చ జరుగుతుంది.

బీజేపీతో పొత్తుకే తెలంగాణాలో బాబు ఎంటర్ అయ్యారా?

బీజేపీతో పొత్తుకే తెలంగాణాలో బాబు ఎంటర్ అయ్యారా?

ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు ఫోకస్ పెట్టడం వెనుక బీజేపీతో పొత్తు వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు మాత్రమే కాకుండా, బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఒక్కసారిగా అందరూ చంద్రబాబు ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు పావులు కదపడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని తాజా పరిణామాలతో అర్థమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+