Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణపై రంగంలోకి చంద్రబాబు, అవసరమైతే రాహుల్ గాంధీకి ఫోన్, వారికే టిక్కెట్లు!

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తెలంగాణ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశమవుతారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పొత్తులు, సీట్ల పంపకాలు, ప్రచార కార్యక్రమాలపై చంద్రబాబు దృష్టి సారించనున్నారు.

చదవండి: ఎన్టీఆర్ ఉన్నప్పుడు వేరు, అందుకే కలిశాం: కాంగ్రెస్‌తో పొత్తుపై టీడీపీ కొత్త వాదన!

సీట్ల పంపకాలపై ఇప్పటి వరకు మహాకూటమిలో ఖరారు కాలేదు. ఈ నెల 30వ తేదీలోపు పూర్తవుతుందని కాంగ్రెస్ నేత జానారెడ్డి చెప్పారు. కానీ టిక్కెట్ల కోసం హోరాహోరీ కనిపిస్తోంది. కూటమిలోని అన్ని పార్టీలు ఎక్కువ సీట్లు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాక గమనార్హం.

ఎక్కువ స్థానాల్లో పోటీకి టిడిపి ప్రయత్నం

ఎక్కువ స్థానాల్లో పోటీకి టిడిపి ప్రయత్నం

తెలంగాణలో దాదాపు 25 నుంచి 30 స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. బలం ఉన్నచోట పోటీ చేయాలనుకుంటోంది. టిక్కెట్ కోసం పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. మాజీ నేతలు కూడా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణలో టీడీపీకి వచ్చే సీట్లు, ఇచ్చే టిక్కెట్ల పైన దృష్టి సారిస్తున్నారు. ఈ రోజు నేతలతో భేటీ అయి పలు అంశాలపై చర్చించనున్నారు. టీడీపీకి రావాల్సిన సీట్లపై, టిక్కెట్ రేసులో ఉన్న వారిపై చర్చిస్తారు. తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అనంతరం కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి తదితరులతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే రాహుల్ గాంధీకి ఫోన్ చేస్తారని సమాచారం. సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాటు పూర్తి చేస్తే ఆపై ప్రచారం ప్రారంభించాలని టీడీపీ భావిస్తోంది.

ప్రచారానికి చంద్రబాబు దూరం

ప్రచారానికి చంద్రబాబు దూరం

తెలంగాణలో ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దూరంగా ఉండనున్నారు. తాను నేరుగా ప్రచారం చేయనని, కానీ పార్టీ తరఫున హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కొందరు ఏపీ మంత్రులు పర్యటిస్తారని తెలంగాణ నేతలతో అధినేత చెప్పారని తెలుస్తోంది.

తొందరపడితే అసలుకే మోసం

తొందరపడితే అసలుకే మోసం

మరోవైపు, మహాకూటమిలోని కాంగ్రెస్, తెలుగుదేశం, కోదండరాం జనసేన, సీపీఐలు సీట్ల పంపకాలపై తర్జన భర్జన పడుతున్నాయి. మరోవైపు, సీట్ల పంపకాలపై తొందరపడితే అసలుకే మోసం వస్తుందని, కూటమి విచ్ఛిన్నం కావాలని టీఆర్ఎస్ ఎదురు చూస్తోందని, కాబట్టి సీట్ల పంపకాలపై ఎక్కువగా మాట్లాడవద్దని భావిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణతో చర్చించారు. అనంతరం సీపీఐ నేతలు తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాంను కలిశారు.

అన్ని పార్టీల్లో గెలిచే వారికే టిక్కెట్లు

అన్ని పార్టీల్లో గెలిచే వారికే టిక్కెట్లు

నవంబరు 12 నుంచి 19 దాకా నామినేషన్ల దాఖలుకు సమయం ఉందని, కూటమికి బలం పెరుగుతున్నందున టికెట్‌ ఆశించే వారి సంఖ్య పెరుగుతోందని, ఇప్పుడే తొందరపడి సీట్లను ప్రకటించడంకన్నా నిదానంగా వ్యవహరించడమే సరైన రాజకీయ వ్యూహమని ఎల్ రమణ చెప్పారని తెలుస్తోంది. తొందరపడితే ప్రత్యర్థి పార్టీ నుంచే కాకుండా, కూటమి పక్షాల్లో టికెట్‌, సీటు దక్కని వారి నుంచి సైతం ఇబ్బందులు పెరుగుతాయని భావిస్తున్నారు. అన్ని పార్టీల్లో గెలిచే వారికే టిక్కెట్లు ఇవ్వాలని యోచిస్తున్నారు. ప్రతి పార్టీ సీట్లపై ఓ అజెండాతో వెళ్తుందని, కానీ అవసరమైన చోట సర్దుబాట్లు, త్యాగాలు తప్పవంటున్నారు.

అన్ని పార్టీల తరఫున ఉమ్మడి సీఎంపీ

అన్ని పార్టీల తరఫున ఉమ్మడి సీఎంపీ

మహాకూటమి తరఫున రూపొందించిన కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) అమలుకు చట్టబద్ధమైన ఏర్పాటు చేస్తామని ప్రజలకు గట్టిగా చెప్పాలని కూటమి నేతలు నిర్ణయించారు. అన్ని పార్టీల తరఫున ఉమ్మడి కూటమిని ఏర్పాటుచేసి సీఎంపీ అమలును పర్యవేక్షించాలనే ప్రతిపాదన చేశారు. దీనిపై మరింత చర్చించాక, తుది ప్రకటన చేయనున్నారు. కేసీఆర్ కుటుంబ కూటమిని గెలిపిస్తారా, ప్రజలకు అండగా ఉంటే మహా కూటమిని గెలిపిస్తారా అనే ప్రచారంతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+