ఉండవల్లిలో ఆధార్!: హైద్రాబాద్‌ని పూర్తిగా వదిలేస్తున్న చంద్రబాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను పూర్తిగా వదిలేందుకు నిర్ణయించుకున్నారా? అంటే అవుననే అంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

విభజనకు ముందు చంద్రబాబు, ఆయన కుటుంబానికి హైదరాబాదులో ఓటర్ కార్డు, ఆధార్ కార్డు వంటివి ఉన్నాయి. ఇప్పుడు ఏపీ పాలన మొత్తం హైదరాబాద్ నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలి వెళ్తోంది. చంద్రబాబు ఏపీ నుంచే పరిపాలన చేస్తున్నారు.

సర్వే: కెసిఆర్ నెంబర్ వన్, 13వ స్థానంలో చంద్రబాబు
విజయవాడ సమీపంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని లింగమనేని అతిథి గృహంను ఆయన నివాసంగా మార్చుకున్నారు. తాజాగా, ఆయన తన ఆధార్ కార్డులోని చిరునామాను మార్చేయాలని ఉండవల్లి గ్రామ పంచాయతీ అధికారులను కోరారు.

Chandrababu will leave Hyderabad completely!

ప్రస్తుతం తన ఆధార్ కార్డులోని హైదరాబాద్ చిరునామాకు బదులుగా ఉండవల్లి అడ్రస్ చేర్చాలని ఆయన కోరారు. ఈ మేరకు తాడేపల్లి మండల అధికారులు చర్యలు చేపట్టారు. పనిలో పనిగా ఓటరు కార్డులోని తన హైదరాబాద్ చిరునామాను కూడా మార్చేసి ఉండవల్లి చిరునామానే చేర్చాలని కూడా చెప్పారని తెలుస్తోంది.

కేసీఆర్ దెబ్బకు బాబు కార్నర్!: చిరు సహా ఎవరికీ తప్పడం లేదా?
చంద్రబాబు తన ఓటర్ కార్డును ఉండవల్లికి మార్చుకుంటే, హైదరాబాదులో ఆయనకు ఓటు హక్కు ఉండదు. అంటే మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి పంచాయతీలో ఆయన ఓటు హక్కు కలిగి ఉంటారు. గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు హైదరాబాదులో ఓటు వేసిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu Naidu will leave Hyderabad completely!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి