హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Priyanka Reddy murder: నిర్భయ తర్వాత శంషాబాద్ ఘటనే: చట్టాల మార్పుపై కిషన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంత దారుణానికి ఒడిగట్టడం సమాజానికి సవాల్ అని కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సామూహిక అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

priyanka reddy murder: ఉరితీయండి లేదా కాల్చేయండి.. చెన్నకేశవులు తల్లి

బ్రిటీష్ కాలం నాటి చట్టాల్లో మార్పులు..

బ్రిటీష్ కాలం నాటి చట్టాల్లో మార్పులు..

తెలంగాణ పోలీసులు ప్రియాంక కేసులో వేగంగా దర్యాప్తు చేసి నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. బ్రిటీష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ చట్టాలను మార్చబోతున్నట్లు ఆయన తెలిపారు. ట్రయల్ కోర్టు శిక్ష విధిస్తే దాన్ని హైకోర్టులో స్టే తెచ్చుకోవడం, సుప్రీంకోర్టుకు వెళ్లి.. సంవత్సరాల తరబడి నేరస్తులకు శిక్షపడకుండా జరుగుతున్న విధానం మార్చబోతున్నామని వివరించారు .

ఇక అలాంటివి ఉండవు..

ఇక అలాంటివి ఉండవు..

ట్రయల్ కోర్టు శిక్ష విధిస్తే.. సుప్రీంకోర్టులోనే ఫైనల్ హియర్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ఓ యాప్‌ను ప్రవేశపెట్టామని, దేశంలోని ప్రతి ఆడబిడ్డ, ప్రతి వ్యక్తి 112 యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఆపదలో ఉన్నామని భావించి ఆ నెంబర్‌కు మెసేజ్ చేస్తే కుటుంబసభ్యులతోపాటు ఐదారుగురు పోలీసు అధికారులకు ఆ సందేశం వెలుతుందని చెప్పారు. ఢిల్లీలో తానే ఈ యాప్‌ను విడుదల చేసినట్లు తెలిపారు.

112 తెలంగాణ వ్యాప్తంగా..

112 తెలంగాణ వ్యాప్తంగా..

112పై తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఇప్పటికే చెప్పామని తెలిపారు. ఇందుకు ఆర్థిక సాయం కూడా కేంద్రమే చేస్తుందని తెలిపారు. తెలంగాణ డీజీపీతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. సమస్య తీవ్రత తన దృష్టికి వచ్చిందని తెలిపారు. పార్లమెంటులో కూడా ప్రియాంక ఘటనపై మాట్లాడనని చెప్పారు. అందరిలో చైతన్యం రావాలని.. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వాళ్లను క్షమించరాదని కిషన్ రెడ్డి అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్లుండి అమ్మాయిలపై జరుగుతున్న దాడులపై పార్లమెంటులో ప్రస్తావించనున్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్ 112 యాప్ గురించి పార్లమెంటులో చెబుతానని తెలిపారు.

చట్టాల్లో మార్పులు.. సలహాలు ఇవ్వండి..

చట్టాల్లో మార్పులు.. సలహాలు ఇవ్వండి..

ఆపదలో ఉన్న అమ్మాయిలను ఆదుకునేందుకు చట్టాలను మార్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. డీపీఆర్ఎన్డీ రీసెర్చి ఇనిస్టిట్యూట్ తీసుకొస్తున్నామని, ఐపీసీ సీఆర్పీసీ చట్టాలకు మార్పులు చేస్తామని చెప్పారు. డ్రాఫ్టులు కూడా సిద్ధమయ్యాయని తెలిపారు. దేశ ప్రజలందరూ సలహాలు ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. పసిపిల్లల మీద ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేసినప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎల్లుండి ఆర్మ్స్ యాక్ట్ మార్పునకు సంబంధించి కూడా చట్టంలో మార్పు తీసుకొస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలో ఉన్నప్పటికీ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా సూచనలు చేస్తున్నామని, టెక్నాలజీని అందిస్తున్నామని తెలిపారు.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested
పోక్సో చట్టంలో మార్పుల వల్లే 51 రోజుల్లో ఉరి..

పోక్సో చట్టంలో మార్పుల వల్లే 51 రోజుల్లో ఉరి..

పోక్సో చట్టానికి మార్పులు చేశామని, అందుకే వరంగల్ ఘటనలో నిందితుడికి 51 రోజుల్లోనే ఉరిశిక్ష పడిందని కిషన్ రెడ్డి చెప్పారు. ఆపదలో ఉన్నామంటూ వచ్చే ప్రజలకు మా పరిధి కాదు, మా జోన్ కాదంటూ పోలీసులు చెప్పడం సరికాదని అన్నారు. అలా చెప్పకుండా చట్టాలు కూడా మారుస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. ఇలాంటి కేసుల్లో పరిధులతో సంబంధం లేకుండా కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుకూడా తెలిపిందన్నారు.

నిర్భయ తర్వాత అత్యంత..

నిర్భయ తర్వాత అత్యంత..

నిర్భయ తర్వాత అత్యంత చర్చనీయాంశమైనది శంషాబాద్ ఘటన అని కిషన్ రెడ్డి తెలిపారు. అమ్మాయి పేరు, కుటుంబం పేరు తాను చెప్పడం లేదని అన్నారు. ప్రజలు ఆవేశం, ఆక్రోశంతో ఉన్నారని.. వారి ఆలోచనకు అనుగుణంగా పోలీసులు చర్యల తీసుకుంటారనుకుంటున్నట్లు తెలిపారు. 112 తెలంగాణలో వచ్చినట్లయితే ఆపదలో ఉన్నవారికి సాయం తొందరగా అందుతుందని చెప్పారు. సాయం చేసేవారు వాలంటీర్లుగా పేర్లు నమోదు చేసుకుని, ఆపదలో ఉన్నవారికి సాయం చేయవచ్చని అన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా కూడా మనకు తెలిసినవారందరికీ సందేశాలు వెళుతాయన్నారు. 112 యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఇలాంటి మరో ఘటన జరగకుండా చూడాలని అన్నారు.

గుజరాత్‌లో రాత్రి ఒంటిగంటకు కూడా..

గుజరాత్‌లో రాత్రి ఒంటిగంటకు కూడా..

గుజరాత్ గాంధీనగర్‌లో రాత్రి 12, ఒంటి గంట సమయంలోకూడా అమ్మాయిలు భయం లేకుండా తిరుగుతుంటారని చెప్పారు. ఇక్కడ మాత్రం 9.30గంటలకే ప్రియాంక రెడ్డిపై దారుణం జరిగిందన్నారు. మనషుల్లో మార్పునకు ప్రయత్నించాలన్నారు. అమ్మాయిల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మీడియా కూడా తనవంతుగా కృషి చేయాలన్నారు. పుణెలో డిసెంబర్ 6,7,8 తేదీల్లో డీజీపీల సమావేశం ఉందని, ఐపీసీ చట్టాల మార్పుపై చర్చించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

English summary
Union minister Kishan Reddy response on Priyanka Reddy murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X