డిసెంబరులో చర్లపల్లి స్టేషన్ ప్రారంభం... ఇక్కడి నుంచి నడిచే రైళ్లు ఇవే

హైదరాబాద్ నగరంలో రూ.428 కోట్లతో అత్యాధునిక వసతులతో దాదాపు 100 సంవత్సరాల తర్వాత సరికొత్త రైల్వేస్టేషన్ రూపుదిద్దుకుంది. అదే చర్లపల్లి. ప్రస్తుతం ఉన్న స్టేషన్ ను ఆధునికీకరించడంతో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లు ఇక్కడినుంచే ప్రారంభం కాబోతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకే దీన్ని ఆధునికీకరించారు. ఉన్న 5 ప్లాట్ ఫామ్స్ కు తోడు మరో నాలుగు కలిపి తొమ్మిది ప్లాట్ ఫారమ్స్ అయ్యాయి. 19 లైన్ల సామర్థ్యంతో ఉంటాయి. చర్లపల్లి టెర్మినల్ ను విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దారు. 9 ప్లాట్ ఫాంలు, 9 లిఫ్ట్ లు, 5 ఎస్కలేటర్లు, రెండు ఫుట్ ఓవర్ వంతెనలు అందుబాటులోకి వచ్చాయి.

అశ్వనీ వైష్ణవ్ ప్రారంభించాల్సి ఉంది..
వాస్తవనికి ఈరోజు (30వ తేదీ) కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ చర్లపల్లిని ప్రారంభించేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే అనుకోని కారణాలవల్ల మంత్రి షెడ్యూల్ రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్ గా ప్రారంభిస్తారని మొదటినుంచి ప్రచారం జరిగిందికానీ అది వీలుపడటంలేదు. స్టేషన్ నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. చర్లపల్లి టెర్మినల్ కు చేరుకునేందుకు రోడ్ల వెడల్పు పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి బిజీ షెడ్యూల్ వల్ల రైల్వే మంత్రి ప్రారంభిస్తారనుకుంటే అది కూడా రద్దయింది. దీంతో వచ్చే నెలలో ప్రారంభం ఉంటుందని అధికారులు వెల్లడించారు. మొత్తం 25 జతల రైళ్లు ఇక్కడినుంచి రాకపోకలు సాగించనున్నాయి. ఆరు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడిచేలా, 12 రైళ్లను ఈ స్టేషన్ లో ఆపేలా రైల్వేబోర్డు నుంచి అనుమతులు లభించాయి. హౌరా, షాలిమార్, సంత్రాగచ్చి, జమ్ము, జైపూర్, పాట్నాలాంటి దూర ప్రాంతాలకు నడిచే రైళ్లను ఇక్కడినుంచే నడపాలనే యోచనలో అధికారులు ఉన్నారు. అనుమతులు వచ్చిన తర్వాత వాటిని ప్రకటించారు.

Charlapally Railway Station will open december month List of trains running from charlapally terminal

చర్లపల్లి నుంచి నడవబోతున్న రైళ్లు

18045 షాలిమార్‌ - హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌
18046 హైదరాబాద్ - షాలిమార్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌
12604 హైదరాబాద్ - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌
12589/12590 గోరఖ్‌పూర్‌ - సికింద్రాబాద్‌ - గోరఖ్ పూర్
12603 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌

చర్లపల్లి స్టేషన్ లో ఆగే రైళ్ల వివరాలు

12713/123714 విజయవాడ - సికింద్రాబాద్‌ - విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌
17201/17202 గుంటూరు - సికింద్రాబాద్‌ - గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌
17233/17234 సికింద్రాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ - సికింద్రాబాద్ భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌
12705/12706 గుంటూరు - సికింద్రాబాద్‌ - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌
17011/17012 హైదరాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌
12757/12758 సికింద్రాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+