నరేంద్ర మోడీలో రామానుజాచార్యులు, శ్రీరాముడి సుగుణాలు: చిన్నజీయర్ స్వామి ప్రశంసలు
హైదరాబాద్: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చాకే దేశ ప్రజలు తలెత్తుకుని జీవిస్తున్నారని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తైన రామానుచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించిన అనంతరం చిన్నజీయర్ స్వామి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు చిన్నజీయర్ స్వామి.
రామానుజాచార్యుల అంతటి సుగుణాలు కలిగిన వ్యక్తి నరేంద్ర మోడీ అని వ్యాఖ్యానించారు. శ్రీరామచంద్రుని వలే మోడీ వ్రత బద్ధుడని కొనియాడారు. రాముడిలా ప్రధాని మోడీ కూడా రాజధర్మం ఆచరిస్తున్నారన్నారు. ప్రపంచంలో భారత్ తలెత్తుకొని ఉండేలా చేస్తున్నారని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మోడీ కంకణబద్ధులై ఉన్నారని చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రామానుజాచార్యుల స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. మనుషులంతా ఒక్కటేనని.. రామానుజాచార్యులు బోధించారన్నారు. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని చినజీయర్ స్వామి ఏర్పాటు చేశారని కొనియాడారు. సమతా స్ఫూర్తి కేంద్రం గొప్ప క్షేత్రంగా వెలుగొందుతుందన్నారు. ప్రధాని మోడీ కాశీ క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
సమాతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ
సమతా సూత్రాన్నిలోకానికి అందించిన శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో శనివారం సాయంత్రం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి నేతృత్వంలో నిర్మించిన 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వసంత పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. పంచలోహాలతో రూపొంది, కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహం కావడం గమనార్హం.
రామానుజాచార్యులు జ్ఞానం, ధ్యానానికి ప్రతీక: ప్రధాని మోడీ
అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జగద్గురు శ్రీ రామానుజాచార్య భారీ దివ్య రూప విగ్రహం ద్వారా భారతదేశం మానవ శక్తిని, స్ఫూర్తిని పొందుతోందని అన్నారు. రామానుజాచార్య విగ్రహం ఆయన జ్ఞానం, నిర్లిప్తత, ఆదర్శాలకు చిహ్నమని పేర్కొన్నారు. భారతదేశం అద్వైతం కూడా ఉంది. ద్వంద్వత్వం కూడా ఉంది. ఈ ద్వంద్వ-అద్వైతాలను కలుపుతూ.. శ్రీ రామానుజాచార్య విశిష్ట-ద్వైతం కూడా ఉందని మోడీ వెల్లడించారు. ఇక్కడ 108 దివ్య క్షేత్రాలను దర్శించుకున్నట్లు మోడీ తెలిపారు. దేశమంతా తిరిగి దేవాలయాలు చూసిన అనుభూతి కలిగిందని ప్రధాని అన్నారు. గురువు వల్లే మనిషి జ్ఞానం వికసిస్తుందన్నారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీకగా ప్రధాని పేర్కొన్నారు.
రామానుజుడు 11వ శతాబద్ధంలోనే మానవ కళ్యాణం గురించి ఆలోచించారన్నారు. చినజీయర్ స్వామి తనతో విశ్వక్సేనేషి యజ్ఞం చేయించారన్నారు. విశ్వక్సేనేష్టి యజ్ఞఫలం 130 కోట్ల మంది ప్రజలకు అందాలని ఆకాంక్షించారు. మనదేశంలో ద్వైతం, అద్వైతం కలిసి ఉన్నాయని తెలిపారు. రామానుజార్యుల బోధనలో వైరుధ్యం ఎప్పుడూ రాలేదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రామానుజాచార్యులు అంధ విశ్వాసాలను పారదోలారని ప్రధాని మోడీ తెలిపారు. రామానుజుడి విశిష్టాద్వైతం మనకు ప్రేరణ, భక్తికి కులం, జాతి లేదని రామానుజాచార్యలు చాటి చెప్పారన్నారు ప్రధాని మోడీ. రామానుజాచార్యులు దళితులకు ఆలయ ప్రవేశం చేయించారని, మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటారన్నారు. రామానుజాచార్యుల సమతా సూత్రం మన రాజ్యాంగానికి స్ఫూర్తి అని తెలిపారు. అసమానతల నివారణకు కృషి చేసిన ఆధునిక నాయకుడు అంబేద్కర్ అని అన్నారు.
పంచలోహాలతో రూపొంది, కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహం కావడం గమనార్హం. సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 ఆలయాల నిర్మాణం చేపట్టారు. సమతామూర్తి కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఎల్ఈడీ దీపాల కాంతుల్లో కేంద్రం, యాగశాలలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ప్రత్యేకంగా బెంగళూరుతోపాటు విదేశాల నుంచి తెప్పించిన వందకుపైగా రకాల పుష్పాలతో ప్రాంగణమంతా అందంగా అలంకరించారు. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో నిర్వహించిన విశ్వక్సేనేషి యాగంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో ప్రధానికి.. చినజీయర్ స్వామి స్వర్ణ కంకణం కట్టారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications