అక్కడే డౌట్!: బాబుపై చిరంజీవి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/విజయవాడ: బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను మినహాయించడం, గతంలో వచ్చిన రుద్రమదేవి సినిమాకు మినహాయించకపోవడంపై ఇప్పుడు చర్చ సాగుతోంది.

నిజమా.. నువ్వేనా :చిరంజీవిని సర్‌ప్రైజ్ చేసిన రోజా, అందరికీ షాక్!

కేసీఆర్ ప్రభుత్వం నిన్న రుద్రమదేవికి, నేడు గౌతమీపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేవలం బాలకృష్ణ సినిమాకు మాత్రమే మినహాయించడం అనుమానాలు రేకెత్తిస్తోందని అంటున్నారు.

స్వయంగా దీనిపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి సహా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Chiranjeevi

చారిత్రాత్మక సినిమాలకు రాయితీలు ఇవ్వడం మంచిదేనని, కానీ నేడు గౌతమీపుత్ర శాతకర్ణికి ఇచ్చి, నిన్న రుద్రమదేవికి ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోందని చిరంజీవి అన్నారు. రుద్రమదేవికి, గౌతమీపుత్ర శాతకర్ణికి తెలంగాణలో ఇచ్చారని, కానీ ఏపీలో మాత్రం బాలయ్య సినిమాకు మాత్రమే ఇచ్చారన్నారు.

చిరంజీవి వ్యాఖ్యలు పరోక్షంగా చూసినా, ప్రత్యక్షంగా అనుకున్నా.. చంద్రబాబు ప్రభుత్వాన్నే అన్నారని అంటున్నారు. నేరుగాపేరు ప్రస్తావించకపోయినా చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నేత అయినందున ఆయన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి.

ఎపి రాజకీయాలపై ఆసక్తి: ముగ్గురు స్టార్లు పోటీ పడుతారా?

చిరంజీవి కాపు ఉద్యమానికి మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. చిరంజీవికి దాసరి నారాయణ రావు కూడా తోడు అయ్యారు. వీరు కాపు నేత ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా నిలిచారు.

పన్ను మినహాయింపు పైన చిరంజీవి యథాలాపంగా అన్నప్పటికీ.. ఆయన కాంగ్రెస్ నేత కాబట్టి వాటిని రాజకీయంగా కూడా వ్యాఖ్యానించలేదని చెప్పడానికి లేదని అంటున్నారు.

ముద్రగడతో కలిసి దాసరి, చిరంజీవిలు పరోక్షంగా, ప్రత్యక్షంగా చంద్రబాబును టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతగా చిరంజీవి ఈ అవకాశాన్ని కూడా పరోక్షంగా ఉపయోగించుకోలేదని చెప్పడానికి లేదని అంటున్నారు. అయితే, గౌతమీపుత్ర..కు ఇచ్చి, రుద్రమదేవికి ఇవ్వకపోవడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు.

చిరంజీవి సినిమాపై చంద్రబాబు కుట్ర!: రాజకీయ రంగు.. నిజాలేమిటి?

ఇదిలా ఉండగా, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను రాయితీపై హైకోర్టులో వ్యాజ్యం కూడా దాఖలైంది. ఆ చిత్రానికి ఏపీ ప్రభుత్వం వినోదపు పన్ను రాయితీ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఈ పిటిషన్‌ వేశారు.

బాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బావమరిది కాబట్టి రాయితీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా సంక్రాంతి సెలవుల తర్వాత విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chiranjeevi targets Chandrababu Naidu over tax exemption.
Please Wait while comments are loading...