వేధింపులు: సీఐపై కమిషనర్‌కు మహిళా కానిస్టేబుళ్ల ఫిర్యాదు
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ నిత్యం తమను వేధిస్తున్నారని మహిళా సిబ్బంది సీపీ సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేశారు.
వరంగల్: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ నిత్యం తమను వేధిస్తున్నారని మహిళా సిబ్బంది బుధవారం పోలీసు కమిషనర్ సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన బదిలీలలో స్టేషన్‌కు వచ్చిన ఆయన సిబ్బందిని ఇబ్బందికరమైన మాటలతో వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కమిషనరేట్‌లో ఏ పోలీసుస్టేషన్‌లో లేని విధంగా పరేడ్ చేయాలని మహిళా కానిస్టేబుళ్లపై ఒత్తిడి తెస్తున్నారని, గర్భిణులు అని కూడా చూడకుండా అవస్థలు పెడుతున్నారని వారు కమిషనర్‌కు తెలిపారు.

చెరువులోపడి మతిస్థిమితం లేని మహిళ మృతి
మతిస్థిమితం లేని మహిళ వడ్డేపల్లి చెరువులో పడి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కాజీపేట సీఐ రమేష్‌కుమార్ కథనం ప్రకారం... సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన గాల జ్యోతిరాణి(55) కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు సైకియాట్రిస్టు వద్దకు ఆరోగ్య పరీక్షలు చేయించి మందులు వాడుతున్నారు.
అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కాజీపేట పట్టణంలో ఉన్న చిన్నమ్మ ఇంటికి జ్యోతిరాణితో కుమారుడు భవానిశంకర్ మంగళవారం వచ్చాడు. తల్లిని కాజీపేటలో వదిలిపెట్టి కొడుకు సికింద్రాబాద్ వెళ్లిపోయాడు.
కాగా, అందరూ పడుకున్న తరువాత బయటకు వచ్చిన జ్యోతిరాణి వడ్డేపల్లి కట్టపైకి చేరుకుని నీటిలో దూకి మరణించినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు భవానీశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications