వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చిన సి.ఎల్ .పి

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభను తప్పుదోవపట్టించారని ఆరోపిస్తూ ఆయనపై కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సభాహక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చింది. పీజు రీ ఎంబర్స్ మెంట్ పై గత ఏడాది మార్చి29వ.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం సభాహక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చింది. ముఖ్యమంత్రి కెసిఆర్ సభను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

పీజు రీ ఎంబర్స్ మెంట్ పై సభను పక్కదారి పట్టించేలా ముఖ్యమంత్రి మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం ఆరోపించింది. ఈ విషయమై గతంలో సభలో మాట్లాడిన అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది.

అసెంబ్లీ 168 నిబంధన కింద స్పీకర్ కు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం నోటీసును గురువారం నాడు అందించింది.2016 మార్చి 29వ, తేదిన శాసనసభలో ముఖ్యమంత్రి పీజు రీ ఎంబర్స్ మెంట్ పై మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ గుర్తుచేసింది.

clp given to privilege notice against cm kcr

2016 ఏప్రిల్ నాటికి మొత్తం పీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను చెల్లిస్తామని సిఎం హమీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే గురువారం నాడు సభలో పీజు రీ ఎంబర్స్ మెంట్ పై చర్చ సందర్భంగా బకాయిలను వందశాతం ఫీజు బకాయిలను చెల్లించడం సాధ్యం కాదనడం సరైందికాదన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.

గతంలో ఓ రకంగా , ఇప్రుడు ఓ రకంగా ముఖ్యమంత్రి మాట్లాడారని ఆ పార్టీ ఆరోపించింది.సభను తప్పుదోవపట్టించారని కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం ఆరోపించింది. ఈ మేరకు ముఖ్యమంత్రిపై సభహక్కుల ఉల్లంఘన నోటీసును 168 నిబంధన కింద స్పీకర్ కు అందజేసింది.

English summary
clp given to privilege notice against cm kcr, according to 168 assembly rules congress party given this notice to sepaker on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X