• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో నూత‌న ఉత్సాహాన్నినింపాలి.!పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన భ‌ట్టి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాతి పర్వదిన శుభాకాంక్షలు తెలినపారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. వరి ధాన్యం ఇంటికి చేరిన వేళ బందు మిత్రులతో, పశు పక్షాదులతో సంతోషంగా జరునుకునే పండుగ సంక్రాంతి పడుగని భట్టి విక్రమార్క స్పష్టం చేసారు. కొత్త పంటతో చేసుకునే తీపి పరవన్నాలను కుటుంబ సభ్యులు ఆనందంగా ఆస్వాదించడంమే సంక్రాంతి పర్వదిన గొప్పదనమని అన్నారు. ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ రాజకీయ నాయకుల సంకుచిత విధానాల వల్ల కళ తప్పిందని ఆవేదన వ్యక్తం చేసారు.

తెలుగు ప్రజలకు భట్టి సంక్రాంతి శుభాకాంక్షలు.. రాజకీయాల వల్ల సంక్రాంతి కళ తప్పిందన్న భట్టి

తెలుగు ప్రజలకు భట్టి సంక్రాంతి శుభాకాంక్షలు.. రాజకీయాల వల్ల సంక్రాంతి కళ తప్పిందన్న భట్టి

తెలుగు ప్ర‌జ‌ల‌కు తెలంగాణ కాంగ్రెస్ శాస‌న‌స‌భ ప‌క్ష నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. భోగి, సంక్రాంతి, క‌నుమ పండుగ‌ల‌ను ప్ర‌జ‌లు ఆనందంగా జ‌రుపుకోవాల‌ని, సంక్రాంతి పండుగ రైతుల జీవితాల‌తో పాటు ప్ర‌జ‌లంద‌రికి నూత‌న ఉత్సాహాన్ని తీసుకురావాల‌ని ఆకాంక్షించారు.
హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు.. భోగి మంటలు, వేకువజామునే జంగమదేవరల జేగంటల మధ్య సంక్రాతి శోభ ఉట్టిపడుతుందని భట్టి అభివర్ణించారు.

శోభాయమానంగా పల్లెలు.. సంక్రాంతి శోభతో కళకళలాడాన్న భట్టి విక్రమార్క

శోభాయమానంగా పల్లెలు.. సంక్రాంతి శోభతో కళకళలాడాన్న భట్టి విక్రమార్క

అంతే కాకుండా ఢమరుక నాదాలూ.. పిట్టలదొరల బడాయి మాటలు.. తెలుగు లోగిళ్లలో కొత్త వెలుగులు నింపే సంక్రాంతి వైభవం నేటి పాలకులు ప్రజా వ్యతిరేక విధానాల వల్ల కళ తప్పిందని అన్నారు. పాడి-పంట‌లు ఇంటికొచ్చిన వేళ సంక్రాంతి సంబురాలు జ‌రుపుకోవాల్సిన రైతుల ప‌రిస్థితి ఈ ఏడు ద‌య‌నీయంగా ఉంద‌న్నారు.ఆకాల‌వ‌ర్షం అన్నదాతలకు కడ‌గండ్లు మిగిల్చింద‌ని, ప‌త్తి, మిర్చి పంటలకు తెగుళ్లు సోకి రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం భ‌ట్టి చేశారు.

టిఆర్ఎస్ ప్ర‌భుత్వం సంబురాల ఆర్భాటం.. క్షేత్ర స్థాయిలో అంతా శూన్యమేనన్న భట్టి

టిఆర్ఎస్ ప్ర‌భుత్వం సంబురాల ఆర్భాటం.. క్షేత్ర స్థాయిలో అంతా శూన్యమేనన్న భట్టి

ధాన్యం అమ్ముకోవ‌డానికి ఆవ‌స్థ‌లు ప‌డి అప్పుల‌పాలైన రైత‌న్న‌లు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్ర ప్ర‌భుత్వం రైతు బంధు సంబురాలు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు భ‌ట్టి. ఆరుగాలం ప‌డిన క‌ష్టం, పెట్టిన పెట్టుబడి రాక రైతులు దివాళ తీస్తుండ‌గా ఎక‌రానికి 5వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చామ‌ని టిఆర్ఎస్ ప్ర‌భుత్వం చేస్తున్న సంబురాల ఆర్భాటం శ‌వాల మీద చ‌ల్లిన పేలాలు ఏరుకున్న‌ట్టుగా ఉంద‌ని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ వల్ల రైతులకు సంక్రాతి సంబురాలు కరువు.. కోవిడ్ జాగ్ర‌త్త‌లు పాటించి జ‌రుపుకోవాల‌న్న భ‌ట్టి

కేసీఆర్ వల్ల రైతులకు సంక్రాతి సంబురాలు కరువు.. కోవిడ్ జాగ్ర‌త్త‌లు పాటించి జ‌రుపుకోవాల‌న్న భ‌ట్టి

ఇప్ప‌టికే పెట్రోల్‌, డిజిల్ ధ‌ర‌లు పెంచి రైతుల‌పై భారం మోపిన మోడీ సర్కారు ఎరువుల ధ‌ర‌లు పెంచి న‌డ్డి విరిచే ప్ర‌య‌త్నం చేయోద్ద‌ని డిమాండ్ చేశారు.
రైతు వ్య‌తిరేక విధానాలు అవ‌లంభిస్తున్న మోడీ, చంద్రశేఖర్ రావు పాల‌న‌లో రైతుల‌కు సంక్రాంతి సంబురం క‌రువైంద‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌తి రైతు ఇంట సంబురాల సంక్రాంతిని నింపుతుంద‌ని తెలిపారు. క‌రోనా నేప‌త్యంలో పండుగ‌ను ప్ర‌జ‌లు కోవిడ్ జాగ్ర‌త్త‌లు పాటించి జ‌రుపుకోవాల‌ని భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు.

English summary
Sankranthi festival should inspire new life in the lives of the people.!Festive wishes by Bhatti.!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X