వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ కాపాడుకోవాలన్న సీఎల్పీ నేత.!అందుకు జనవరి 9నుంచి భట్టి పాదయాత్ర.!

|
Google Oneindia TeluguNews

మధిర/హైదరాబాద్ : ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మొద్దు నిద్రపోతున్న టిఆర్ఎస్ సర్కారు కండ్లు తెరిపించేందుకు జనవరి 9 నుంచి మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని తెలంగాణ శాసనసభ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న గులాబీ పాలకుల చీడ నుంచి తెలంగాణను కాపాడుకోవడమే లక్ష్యంగా ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామం నుంచి తన పాదయాత్ర మొదలవుతుందని వెల్లడించారు. మధిర నియోజకవర్గం, చింతకాని మండలం నరిసింహపురం గ్రామంలో జరిగిన మండల కాంగ్రెస్ ప్లినరీ సమావేశానికి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

 తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర..సర్కారు కళ్లు తెరిపించాలన్న భట్టి

తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర..సర్కారు కళ్లు తెరిపించాలన్న భట్టి

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భట్టి విక్రమార్కకు మంగళ హారతులు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికడంతో పాటు కాంగ్రెస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు దారి పొడవునా భట్టి విక్రమార్క పై పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన ప్లినరిలో భట్టి విక్రమార్క మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో అన్నదాతలు పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోలేక ఆత్మహత్యలకు పాల్పడటమే సీఎం చంద్రశేఖర్ రావు చేస్తున్న బంగారు తెలంగాణ పునర్నిర్మాణం ఇదేనా అని దుయ్యబట్టారు.

 ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న గులాబీ పార్టీ.. తరిమికొట్టాల్సిన సమయం వచ్చిందన్న భట్టి

ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న గులాబీ పార్టీ.. తరిమికొట్టాల్సిన సమయం వచ్చిందన్న భట్టి

దాన్యం కొనుగోలు చేయలేని సత్తా లేని సర్కారు ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి సర్కార్ ఖజానాను నిలువు దోపిడి చేస్తున్న గులాబీ పాలకుల పీడను తెలంగాణ ప్రజలకు దూరం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కార్మోనుముఖులు కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చేయాల్సిన పనిని విస్మరించి రాష్ట్ర మంత్రులు ఉపాధి హామీ పనులు చేసే మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకెపి ఎపిఎంలు చేసే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప, జిల్లా మంత్రి మూడేళ్లు అవుతున్న ఒక్క కొత్త ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా అని విక్రమార్క నిలదీశారు.

 అభివృద్ది శూన్యం.. ఒక్క ప్రాజెక్టు కూడానిర్మించలేకపోయారన్న సీఎల్పీ నేత

అభివృద్ది శూన్యం.. ఒక్క ప్రాజెక్టు కూడానిర్మించలేకపోయారన్న సీఎల్పీ నేత

ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది బూతు పురాణం తిట్టడానికి, చావు డప్పు కొట్టడానికి కాదని టిఆర్ఎస్ పాలకులకు చురకలంటించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను కాపాడుకునేందుకు, అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం సాధనకై తాను చేపట్టే పాదయాత్ర రాష్ట్రంలో దిశా నిర్దేశం చేయనుందని వివరించారు. ఉద్యోగ నోటిఫికేషన్ , నిరుద్యోగ భృతి అమలు, రైతుల సమస్యల పరిష్కారం, మహిళల సాధికారికత, కొత్త పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన, మిర్చి రైతుల నష్టపరిహారము సాధించేందుకు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నట్లు విక్రమార్క ప్రకటించారు.

 చింతకాని కాంగ్రెస్ ప్లీనరీ లో పాల్గొన్న భట్టి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎల్పీ నేత

చింతకాని కాంగ్రెస్ ప్లీనరీ లో పాల్గొన్న భట్టి.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎల్పీ నేత

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుంకేటఅన్వేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు మొక్కా శేఖర్, దొబ్బల సౌజన్య, పుచ్చకాయల వీరభద్రం, మండల నాయకులు కన్నెబోయిన గోపి, మడిపల్లి భాస్కర్ రావు, కొప్పుల గోవిందరావు, వనం చెన్నప్ప, సట్టు వెంకటేశ్వర్లు, కూరపాటి కిషోర్ ,అబ్దుల్ మజీద్, జానయ్య, బందెల నాగార్జున, పూర్ణచందర్ రావు తదితరులు ఉన్నారు.

English summary
Telangana Legislative Assembly party leader Mallu Bhatti Vikramarka has announced that he will do Padayatra in Madhira constituency from January 9 to open the eyes of the sleeping TRS government, leaving public issues up in the air.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X