• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణా సాధించారు: మంత్రి ఎర్రబెల్లి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండ వరంగల్, హంటర్ రోడ్ లోని శాయంపేట సర్కిల్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, తెలంగాణ ప్రజల్లో నేటికీ ఆ పోరాటపటిమ ఉందని తెలిపారు.

నిజాం రజాకార్లను, దేశ్ ముఖ్ లను ఎదిరించిన ధైర్యశాలి చాకలి ఐలమ్మ

నిజాం రజాకార్లను, దేశ్ ముఖ్ లను ఎదిరించిన ధైర్యశాలి చాకలి ఐలమ్మ

తెలంగాణ వీర వనిత, ధైర్య శాలి చాకలి ఐలమ్మ ఆనాడు నిరంకుశ నిజాం రజాకార్లను, దేశ్ ముఖ్ లను ఎదుర్కొంది అని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి లను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాకలి ఐలమ్మ జీవన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం కిష్టాపురం లో 1895 సెప్టెంబర్ 26వ తేదీన చాకలి ఐలమ్మ జన్మించిందని పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్య తో ఆమె వివాహం జరిగిందని పేర్కొన్నారు. ఐదుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన చాకలి ఐలమ్మ, తన కులవృత్తిని జీవనాధారంగా చేసుకొని బ్రతకారని గుర్తు చేశారు.

తన పొలాన్ని స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నించిన దేశ్ ముఖ్ ను తిప్పికొట్టిన ఐలమ్మ

తన పొలాన్ని స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నించిన దేశ్ ముఖ్ ను తిప్పికొట్టిన ఐలమ్మ

మల్లంపల్లి కొండల రావు కు చెందినపాలకుర్తిలో ని భూమిని కౌలు కి తీసుకున్న చాకలి ఐలమ్మ, నాలుగు ఎకరాలలో పంట పండించిందని, ఆ సమయంలో స్థానిక పట్వారీ పొలంలో పనికి రాకపోవడంతో ఐలమ్మ పై కమ్యూనిస్టులలో చేరిందని ఆయన దేశ్ ముఖ్ కి ఫిర్యాదు చేశాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఐలమ్మ సాగు చేసిన పొలాన్ని తన పేరున రాయించుకొని ఆ పొలం తనదేనని, ఆ పంట కూడా తనదేనని తన మనుషులను దేశముఖ్ పంపించాడని, వాళ్ల ప్రయత్నాలను చాకలి ఐలమ్మ తిప్పి కొట్టారని గుర్తు చేశారు.

 ఆనాడే కోర్టులో కేసు వేసి గెలిచిన ధీశాలి చాకలి ఐలమ్మ

ఆనాడే కోర్టులో కేసు వేసి గెలిచిన ధీశాలి చాకలి ఐలమ్మ

సంఘం సహాయంతో వాళ్ళని తిప్పి పంపిన ఐలమ్మ, కోర్టు లో కేసు వేసి, అనాడు పేరు మోసిన లాయర్ కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారం తో గెలిచారని ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడారు. నాడు దేశ్ బుక్ లను ఎదిరించి చేసిన ఆనాటి ఉద్యమమే, తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయింది. ఆ తర్వాత మలి దశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయ్యిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ ఆనాటి దేశ్ ముఖులు, రజాకార్ల గుండెల్లో భయం పుట్టించిందని, ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే, మరోవైపు అమ్మ లాగా ఉద్యమకారులకు అన్నం పెట్టి ఆదరించిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అంటూ స్పష్టం చేశారు

చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితోనే కేసీఆర్ పాలన

చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితోనే కేసీఆర్ పాలన

ఐలమ్మ తన 90వ ఏట, 1985 సెప్టెంబర్ 10న పాలకుర్తిలో మరణించారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తి తోనే సీఎం కెసిఆర్ తెలంగాణ సాధించారన్న మంత్రి ఎర్రబెల్లి అదే స్ఫూర్తి ని సీఎం కెసిఆర్ కొనసాగిస్తున్నారు అని పేర్కొన్నారు. పరిపాలన లో ఉద్యమ స్ఫూర్తిని పాటిస్తున్నారన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
Minister Errabelli Dayakar Rao revealed that CM KCR achieved Telangana only with Chakali Ilamma's spirit. On the occasion of Chakali Ilamma's birth anniversary, Errabelli said Chakali Ilamma who resisted the Nizam Rajakars and Deshmukhs..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X