నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం అభినందన, ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంటర్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి బైపీసీలో 1000కి 991 మార్కులు సాధించిన విద్యార్ధిని సుష్మని సీఎం కేసీఆర్ అభినందించారు. అంతే కాదు, ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్ కోర్సు చదివిస్తానని హామీ ఇచ్చారు.

పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని సుష్మను కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మంగళవారం ముఖ్యమంత్రి వద్దకు తీసుకొచ్చారు. సీఎం కార్యాలయంలో వారితో ముచ్చటించిన సీఎం కేసీఆర్ వారి కుటుంబ ఆర్ధిక పరిస్ధితి గురించి అడిగి తెలుసుకున్నారు.

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన బరిందేవి సిద్ధిరాములు, శోభ దంపతుల కుమార్తె సుష్మ నిజమాబాద్‌లోని కాకతీయ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివి గొప్ప ప్రతిభ కనబరించిది.

సుష్మకి కేసీఆర్ అభినందన, ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్

సుష్మకి కేసీఆర్ అభినందన, ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్

తల్లి బీడీ కార్మికురాలు కాగా, తండ్రి ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని సుష్మను కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మంగళవారం కేసీఆర్ వద్దకు తీసుకొచ్చారు.

 సుష్మకి కేసీఆర్ అభినందన, ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్

సుష్మకి కేసీఆర్ అభినందన, ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్

క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన సుష్మను కేసీఆర్ అభినందించారు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్నారు. వారి కుటుంబం గతంలో మస్కట్‌కు పోయి ఆర్థికంగా చితికిపోయిన విషయం తెలిసింది.

 సుష్మకి కేసీఆర్ అభినందన, ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్

సుష్మకి కేసీఆర్ అభినందన, ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్

కూలి చేసుకుంటూ జీవనం గడిపే తల్లిదండ్రుల బిడ్డ ఇంత గొప్పగా చదవడం అభినందనీయమని ఆయన అన్నారు. భవిష్యత్‌లో ఏమి కావాలని అనుకుంటున్నావని అడుగగా.. తాను డాక్టర్‌ను కావాలని కోరుకుంటున్నట్లు సుష్మ కేసీఆర్‌కు చెప్పింది. దీంతో డాక్టర్ చదువుకు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.

 సుష్మకి కేసీఆర్ అభినందన, ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్

సుష్మకి కేసీఆర్ అభినందన, ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్

నిరుపేదల ఇళ్లలో కూడా చదువుల తల్లులు పుడతారనడానికి సుష్మే నిదర్శనమని, అలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. సుష్మ చదువు ఖర్చును భరించడానికి అంగీకరించిన కేసీఆర్‌కి ఎమ్మెల్యే గోవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Chief Minister K Chandrasekhar Rao on Tuesday announced that the State government would fund the education of one B Sushma, an intermediate student from Medak district. The girl aims to become a doctor. Hailing from Vadiyaram village in Chegunat mandal, the girl had secured 991 out of the 1000 marks in intermediate second year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X