వైయస్ అన్యాయం చేస్తే కూర్చున్నారేం, అందరి చరిత్రా చెప్తా: కెసిఆర్ హెచ్చరిక

హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆయన హయాంలో అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు చూస్తూ కూర్చుండిపోయారని తెలంగాణ సీఎం కెసిఆర్ ఆదివారం శాసన సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైయస్ అన్యాయం చేస్తుంటే ఇప్పుడు ప్రశ్నించే కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి పులిచింతలను కట్టారని, పోలవర్ హెడ్ రెగ్యురేటరీ ఎత్తు పెంచారన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే తీవ్ర అన్యాయం చేసిందన్నారు.

35 ఏళ్లలో తొలిసారి సింగూరు ఎండిపోయిందని చెప్పారు. లోయర్ పెన్ గంగాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. కర్నాటక, తమిళనాడులు 400 బ్యారేజీలు కడుతుంటే సీమాంధ్ర పాలకులు ఏం చేశారని ప్రశ్నించారు.

KCR

కుట్రతో వివాదాల్లో ఇరికించారు

తుమ్మిడిహెట్టి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును సీమాంధ్ర పాలకులు వివాదంలో ఇరికించారన్నారు. తుమ్మిడిహెట్టిని వివాదంలో ఇరికించిన సీమాంధ్ర పాలకులు దవళేశ్వరం తరలించుకుపోయారన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును తాము వ్యతిరేకించటామన్నారు.

తాము అప్పులు తెస్తున్నామని విపక్షాలు విమర్శించడం విడ్డూరమన్నారు. పలు ప్రాజెక్టులను అంతర్రాష్ట్ర వివాదంలో ఇరికించారన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసిన వైయస్ రాజశేఖర రెడ్డిలో జీవన్ రెడ్డికి దేవుడు ఎలా కనిపించాడని నిలదీశారు. అవసరమైతే మేడిగడ్డతో ఎస్సారెస్సి నింపుకోవచ్చన్నారు.

మహారాష్ట్రతో ఒప్పందం బ్లాక్ డేనా

వాస్తవాలను కాంగ్రెస్ నేతలు భరించలేకపోతున్నారన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్టులపై ఒప్పందం బ్లాక్ డే ఎలా అవుతుందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని ప్రశ్నించారు. చారిత్రక ఒప్పందాన్ని బ్లాక్ డే అంటారా అని నిలదీశారు. ఈ నెల 19న సమావేశానికి మహారాష్ట్ర సీఎంను ఆహ్వానించామని చెప్పారు.

లివ్ అండ్ లెట్ లివ్ పద్ధతిలో మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి తప్ప తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి నిన్నటి వరకు లేదన్నారు. ఎవరు ఏమన్నా ప్రజలు ఇచ్చిన హామీ మేరకు 2018 వరకు మిషన్ భగీరథను పూర్తి చేస్తామన్నారు.

కాంగ్రెస్ నేతల తీరు తలదించుకునేలా ఉంది

లోయర్ పెన్ గంగా, లెండి ప్రాజెక్టులకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్రానికి నష్టం వచ్చేలా మాట్లాడవద్దన్నారు. కాంగ్రెస్ నేతల తీరు తలదించుకునేలా ఉందన్నారు. నాకు పాలమూరు జిల్లా కష్టాలు తెలుసునని చెప్పారు.

అన్నింటికి కాంగ్రెస్‌దే బాధ్యత.. ఇంకా చాలా చెప్పాలి

తెలంగాణకు జరిగిన అన్యాయానికి బాధ్యత అంతా కాంగ్రెస్ పార్టీదే అన్నారు. సీమాధ్ర ముఖ్యమంత్రుల కింద ఊరేగింది కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ నేతలు అన్నారు. మహారాష్ట్రకు మేం తాకట్టుబడ్డామని మాట్లాడుతారా అని భగ్గుమన్నారు.

తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉందన్నారు. ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో విపక్షాలకు ప్రజలు గట్టి బుద్ధి చెబుతున్నారన్నారు. అయినప్పటికీ తాము విపక్షం అనే గౌరవం ఇస్తున్నామన్నారు. విపక్షాలు పిచ్చిగా చేయవద్దన్నారు.

ధనిక రాష్ట్రమే.. ఎవరి చరిత్ర ఏమిటో చెప్తా

తెలంగాణ పునర్నిర్మాణంలో విపక్షాలు భాగస్వామ్యం కావాలన్నారు. దేశం ముందు తెలంగాణ పరువు తీయవద్దన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమేనని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.

చిన్నారెడ్డి ప్రాజెక్టుల పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కెసిఆర్ భగ్గుమన్నారు. సమైక్య రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రుల కింద ఊరేగింది మీరేనని కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిన్నారెడ్డిలపై మండిపడ్డారు.

వాస్తవాలు చెప్పడం ఏకపక్షం కాదన్నారు. ఎవరి చరిత్ర ఏమిటో ఆధారాలున్నాయని, అన్నీ చెప్తానని అన్నారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడతారని మహారాష్ట్ర సీఎం చౌహన్.. నాడు సమైక్య ఏపీ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారన్నారు.

ఎవరి మాటా వినను

తాను అనుకున్నది చేసి తీరుతానని, ప్రజలకు మేలు జరుగుతుందని భావించే పనుల విషయంలో వెనుకంజ వేయబోనని, ఎవరి మాటా వినేది లేదన్నారు. మిషన్ భగీరథ, వాటర్ గ్రిడ్, మెట్రో ప్రాజెక్టు, మహారాష్ట్రతో చేసుకున్న జల ఒప్పందాలు, రహదారుల అభివృద్ధి, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి ఎన్నో అంశాలను ఆయన ప్రస్తావించారు.

ప్రతిదానిని విమర్శించడం విపక్షాలకు పనిగా మారిపోయిందన్నారు. మంచి పనికి సహకరించాలన్న ఇంగిత జ్ఞానం వారికి లేకపోయిందన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే దిశలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందడుగేనన్నారు.

విద్యుత్ ఉద్యోగుల వివాదాలకు ఏపీ అధికారులే కారణమన్నారు. ప్రజలకు అధునాతన వైద్య సేవలను అందించే దిశగా, ఇప్పటికే పలు రాష్ట్రాలు, విదేశాల్లోని ఆసుపత్రులను పరిశీలించి వచ్చామని, త్వరలో గంజినీరు తాగే పేదకు కూడా కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు.

వైద్యానికి ఉన్న ప్రాధాన్యతను గమనించి, గత సంవత్సరం కన్నా మరిన్ని నిధులు కేటాయించాలని ఆర్థికమంత్రికి సూచించామని తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో అక్రమాలు పెరిగిపోయాయని, త్వరలోనే వాటికి పులుస్టాప్ పెడతామన్నారు. అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+