వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ పరామర్శ..5 కోట్ల చెక్ తో పాటు ఉద్యోగ, స్థల పత్రాల అందజేత

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సూర్యాపేటకు వెళ్ళారు. కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి నివాళులు అర్పించారు . నేడు సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోష్ భార్య సంతోషి , అలాగే సంతోష్ బాబు తల్లిదండ్రులు ఉపేందర్,మంజులతో మాట్లాడారు.

Recommended Video

KCR Announces Rs 5 Cr Ex-gratia to Col Santosh's Family & Rs 10 Lakh Each of 19 Other Soldiers

కల్నల్ సంతోష్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం.. విచక్షణాధికారాలు ఉపయోగించిన సీఎం కేసీఆర్..కల్నల్ సంతోష్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం.. విచక్షణాధికారాలు ఉపయోగించిన సీఎం కేసీఆర్..

సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అండగా నిలుస్తామని సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో నేడు ఆయన వారిని పరామర్శించారు . చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. సోమవారం రోడ్డు మార్గంలో సూర్యాపేటలోని విద్యానగర్‌లో ఉన్న సంతోష్‌బాబు నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్‌, భార్య సంతోషిని పరామర్శించారు.ముఖ్యంగా సంతోష్ పిల్లల గురించి అడిగారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు.

రూ.5కోట్ల నగదు, ఉద్యోగ పత్రాలు , ఇంటి స్థల పత్రాలు అందించిన సీఎం కేసీఆర్

రూ.5కోట్ల నగదు, ఉద్యోగ పత్రాలు , ఇంటి స్థల పత్రాలు అందించిన సీఎం కేసీఆర్

ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5కోట్ల నగదును అందించారు సీఎం కేసీఆర్ . ఇక సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు. ఆమెకు డిప్యూటీ కలెక్టర్ గా ఉత్తర్వులు ఇచ్చారు .అలాగే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కేటాయించిన ఇంటిస్థలం పత్రాలను కూడా సీఎం, సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు అందజేశారు.

 కరోనా నేపధ్యంలో నేతలు సూర్యాపేటకు పెద్ద ఎత్తున రాకుండా ఆదేశాలు

కరోనా నేపధ్యంలో నేతలు సూర్యాపేటకు పెద్ద ఎత్తున రాకుండా ఆదేశాలు

ఇక కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్ళిన సీఎం వెంట విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌లు ఉన్నారు .సీఎం వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అక్కడికి వచ్చే అవకాశం ఉండటంతో కరోనా నేపథ్యంలో ఎవ్వరూ రావద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో నేతల హడావిడి లేకుండానే సీఎం కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించి అమరవీరునికి నివాళులు అర్పించారు . సీఎం పర్యటన నేపథ్యంలో సంతోష్‌బాబు ఇంటివద్ద భారీ బందోబస్తు కొనసాగుతుంది.

దేశం కోసమే సంతోష్ బాబు ప్రాణత్యాగం.. కొనియాడిన కేసీఆర్

దేశం కోసమే సంతోష్ బాబు ప్రాణత్యాగం.. కొనియాడిన కేసీఆర్

సూర్యాపేట్ లో కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్ సంతోష్ బాబు పిల్లలు అభిజ్ఞ, అనిరుద్ తేజాల తో మాట్లాడారు. సంతోష్ తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్ లను, అలాగే సోదరి శృతిని పరామర్శించారు. సంతోష్ భార్య సంతోషి కి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఇక హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, సంతోష్ భార్య కు 4 కోట్లు, తల్లిదండ్రులకు కోటి రూపాయల చొప్పున చెక్కులను అందించారు సీఎం కేసీఆర్. దేశ రక్షణ కోసమే సంతోష్ బాబు ప్రాణత్యాగం చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. సంతోష్ మరణం తననెంతో కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని సంతోష్ కుటుంబానికి సూచించారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.

English summary
Chief Minister K Chandrasekhar Rao visited the family members of martyr Colonel Santosh Babu at the latter’s residence in Suryapet on Monday and personally hand over the promised financial package. He had also handed over the appointment letter of a Group-I job to Santosh Babu’s wife Santoshi. He had earlier declared the financial package comprising Rs 5 crore, a house site and a Group-I job to Santoshi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X