పార్లమెంటులో గొంతెత్తండి-నేనూ ఢిల్లీకి వస్తా-తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు-గెజిట్‌పై కేసీఆర్

కృష్ణా,గోదావరి నదులపై తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులు,విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నదీ యాజమాన్య బోర్డుల ఆధీనంలోకి తీసుకొస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ను స్వాగతించగా... తెలంగాణ ప్రభుత్వం దీనిపై సమాలోచనలు జరుపుతోంది. శుక్రవారం(జులై 16) జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గెజిట్ నోటిఫికేషన్‌పై చర్చించారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నప్పటికీ జలాల పంపిణీ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిన విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని ఎంపీలను ఆదేశించారు.

హక్కులకు భంగం వాటిల్లితే న్యాయ పోరాటం : కేసీఆర్

హక్కులకు భంగం వాటిల్లితే న్యాయ పోరాటం : కేసీఆర్

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు,హక్కులకు ఏమాత్రం భంగం వాటిల్లినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హక్కులకు భంగం వాటిల్లితే న్యాయ పోరాటానికి సిద్ధమన్నారు. కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదన వినిపించే అవకాశం లేక అన్యాయం జరిగిందని అన్నారు.

ఇప్పటికైనా కృష్ణా జలాల్లో న్యాయంగా తమకు దక్కాల్సిన వాటాను కేటాయించాలని కోరుతున్నా కేంద్రం పెడ చెవిన పెడుతోందన్నారు. రాష్ట్రాల విభజన జరిగినప్పుడే కేంద్రం చొరవ తీసుకుని నీటి కేటాయింపుల సమస్యను పరిష్కరించాల్సిందని అన్నారు. కానీ అందుకు భిన్నంగా కేంద్రం చోద్యం చేస్తూ ఉండటం వల్లే జల వివాదం మరింత జటిలమైందన్నారు.

అదనంగా ఒక్క చుక్క నీటిని వాడుకోవట్లేదు : కేసీఆర్

అదనంగా ఒక్క చుక్క నీటిని వాడుకోవట్లేదు : కేసీఆర్

రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన వాటాలో నుంచే నోటిని వినియోగించుకుంటున్నామని... అంతకుమించి ఒక్క చుక్క నీటిని వాడుకోవడం లేదని అన్నారు. తెలంగాణ అక్రమంగా నీటిని వినియోగిస్తోందని ఏపీ చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. సాగునీటి ఎత్తిపోతల పథకాలకు అవసరమయ్యే విద్యుత్ కోసమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు... సాగునీటికి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవసరం అవుతోందని అన్నారు. ఇందుకు మరో మార్గం లేదన్నారు.

నేనూ ఢిల్లీకి వస్తా...

నేనూ ఢిల్లీకి వస్తా...

కృష్ణా నదిపై తెలంగాణ కొత్త ప్రాజెక్టులు చేపడుతోందని ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదన సరికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోల ఆధారంగానే ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా కోసం పార్లమెంటులో గొంతెత్తాలని ఎంపీలకు సూచించారు. పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాక తాను కూడా ఢిల్లీకి వస్తానని.. కేంద్ర పెద్దలను కలిసి సమస్యను వివరిస్తానని చెప్పారు. నీళ్ల విషయంలో ఏమాత్రం అన్యాయం జరిగినా రాజీ లేని పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు.

గెజిట్ విడుదల చేసిన కేంద్రం

గెజిట్ విడుదల చేసిన కేంద్రం

తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణా,గోదావరి నదీ జలాల బోర్డుల పరిధి, నిర్వహణపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం రెండు రాష్ట్రాల్లో ఈ నదులపై చేపట్టిన ప్రాజెక్టులు,విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి వెళ్తాయి.నీటి కేటాయింపులు,విద్యుత్ ఉత్పత్తిని బోర్డులే నియంత్రిస్తాయి. బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది.గెజిట్ విడుదలైన రెండు నెలల్లో ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు చొప్పున రెండు రాష్ట్రాలు డిపాజిట్ చేయాలి. అనుమతులు లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు ఆర్నెళ్ల లోగా అన్ని అనుమతులు తీసుకోవాలి. ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి వెళ్లడంతో నీటి కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+