మంత్రులతో సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీట్ - ఫాం హౌస్ నుంచి పిలుపు : స్పీకర్ - సీఎస్ సైతం..!!

తెలంగాణ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతోంది. రాజకీయ నిర్ణయమా లేక పాలనా పరమైన నిర్ణయం పైన చర్చ. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లో ఉన్నారు. వెంటనే అందుబాటులో ఉన్న మంత్రులు తన ఫాం హౌస్ కు రావాలంటూ మంత్రులకు సమాచారం అందింది. దీంతో..సమీపంలో ఉన్న మంత్రులు ఆకస్మికంగా ఫాం హౌస్ నుంచి ఫోన్ రావటంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు.

అందుబాటులో ఉన్న మంత్రులతో

అందుబాటులో ఉన్న మంత్రులతో

సీఎం నుంచి సమాచారం రావటంతో మంత్రులు తా ఇద్రారెడ్డి, హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డి, ఎమ్మెల్యే కవిత హాజరైనట్లు తెలుస్తోంది. అయితే, ఇదే సమయానికి శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కూడా ఫామ్‌హౌజ్‌కు చేరుకున్నారు. కాగా, సీఎస్ సైతం ఫాం హౌస్ కు రావటంతో రాజకీయంగా ఏదైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అనే చర్చ మొదలైంది. నాలుగు రోజుల క్రితమే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.

రాజకీయంగానా.. పాలనా పరంగానా

రాజకీయంగానా.. పాలనా పరంగానా


సమావేశాల్లో కీలకంగా ఉద్యోగాల ప్రకటన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసారు. అదే విధంగా సమావేశాల చివరి రోజున జీవో 111 పైన కీలక నిర్ణయం ప్రకటించారు. ఇక, ప్రస్తుతం కేంద్రం వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. అయితే, సహజంగా ఫాం హౌస్ లో ఉన్న సమయంలో కేసీఆర్ ఇటువంటి అత్యవసర సమావేశాలు నిర్వహించిన సందర్భాలు లేవు. దీంతో..అసలు ఈ సమావేశం అజెండా ఏంటనే దాని పైన ఉత్కంఠ నెలకొని ఉంది.

కీలక నిర్ణయం అంటూ..

కీలక నిర్ణయం అంటూ..


పార్టీ నేతలు సైతం ఈ భేటీ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. మంత్రులతో పాటుగా స్పీకర్..సీఎస్ సైతం హాజరు కావటంతో ప్రభుత్వ పరంగా- రాజకీయాలతో కూడిన నిర్ణయమై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీని పైన ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇక, ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఎం కీలక నిర్ణయం తీసుకొనే క్రమంలోనే మంత్రులతో పాటుగా సీఎస్ ను సైం పిలిపించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీంతో.. ఇంత అత్యవసరంగా తీసుకొనే నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఈ ఉత్కంఠకు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+