మత మౌఢ్యంతో దేశానికి ముప్పు: మధ్యలో వచ్చినవాళ్ళ వల్లే ఇదంతా: సీఎం కేసీఆర్
హైదరాబాద్ సమీపంలోని కోకాపేట వద్ద నిర్మించనున్న హరేకృష్ణ హెరిటేజ్ టవర్ కు ముఖ్యమంత్రి కెసిఆర్ భూమి పూజ చేశారు గొప్ప ఆధ్యాత్మిక వాతావరణంలో అందరి మధ్యా ఉండటం సంతోషం అన్నారు. ప్రశాంత సమాజం కోసం, విశ్వ శాంతి కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికీ తెలంగాణా ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రశాంత సమాజం, దేశ ప్రగతికీ, ప్రపంచ శాంతికీ ముఖ్యమని నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు.మతమౌఢ్యం తోనే దేశానికి ముప్పు వాటిల్లుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.ఏ మతంలోనూ హింసకు తావులేదని, కొంతమంది మధ్యలో వచ్చి సమాజానికి ఇబ్బందులు కలిగిస్తున్నారని, తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.

సమస్యలతో కూడిన నగర జీవనంలో నిజమైన ప్రశాంతత భక్తి, భజన, ప్రార్ధనల వల్ల చేకూరుతుందనీ ఆయన పేర్కొన్నారు. ఆలయాన్ని కమ్నియూటీ సెంటర్ గా చూడాలనీ, సామాజిక స్వాంతన కేంద్రమని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మౌఢ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. వేద సంస్కృతిని సరిగ్గా అర్ధం చేసుకుంటే విశ్వ శాంతినే బోధిస్తుందనీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని పేర్కొన్న సీఎం కేసీఆర్ మధ్యలో వచ్చిన వారే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాలు, దేశాలు వేరైనా మనుషులు పూజించే పరమాత్ముడు ఒక్కడేనని కెసిఆర్ వెల్లడించారు.హరే కృష్ణ మిషన్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందనీ, కరోనా మహమ్మారి సమయంలో కూడా హరికృష్ణ ఫౌండేషన్ ఎన్నో సేవలు అందించినదని కొనియాడారు.

అక్షయ పాత్ర అధ్వర్యంలో ఎలాంటి ఫిర్యాదూ లేకుండా అన్నపూర్ణ క్యాంటీన్ ల నిర్వహణ కోసం కృషి చేస్తోందని అన్నారు. హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం తరఫున 25 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలో విడుదల చేస్తామన్నారు. తెలంగాణా రాష్ట్రంలో యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించామని, కొండ గట్టు, వేములవాడ ఆలయాలను కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications