నేడు జార్ఖండ్ కు సీఎం కేసీఆర్ - అమరవీరుల కోసం : సోరెన్ తో భేటీ .!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ వెళ్లనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం నేరుగా రాంచీ వెళ్లి..జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో భేటీ కానున్నారు. నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి.. రైతు సంఘాల నేత టికాయత్ లో సుదీర్ఘ భేటీలు నిర్వహించారు. జేఎంఎం సైతం ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు రాంచీ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తోనూ జాతీయ రాజకీయాల పైన చర్చించే అవకాశం ఉంది.

గాల్వాన్‌ వ్యాలీ అమరుల కుటుంబాలకు

గాల్వాన్‌ వ్యాలీ అమరుల కుటుంబాలకు

అదే సమయంలో గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చే ప్రక్రియ లో భాగంగా సీఎం కేసీఆర్ రాంచీ టూర్ ఫిక్స్ అయింది. చైనా సరిహద్దులోని గాల్వాన్‌ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది సైనికులు వీర మరణం పొందారు. వీరిలో తెలంగాణకు చెందిన సంతోష్‌ బాబు ఒకరు. ఆ సమయంలో సీఎం కేసీఆర్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి రూ. 5 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించారు. అయితే ఇదే సమయంలో 2020 జూన్‌ 19న ప్రధానమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ మిగతా 19 మంది సైనికులకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

కేసీఆర్ ఆర్దిక సాయం

కేసీఆర్ ఆర్దిక సాయం

అందులో భాగంగా జార్ఖండ్ రాష్ట్రాలనికి చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీార్ ఆర్డిక సాయం అందించనున్నారు. అదే విధంగా ఈ ఘటనలో మరణించిన వారిలో బిహార్‌కు చెందిన వారు ఐదుగురు, పంజాబ్ నుంచి నలుగురు, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఈ నెల 10వ తేదీ తరువాత ఆ రాష్ట్రాల్లోనూ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అమర జవాన్ల కుటుంబాలను తాను ప్రకటించిన సాయం అందించనున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. మహారాష్ట్ర సీఎం థాక్రేతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.

జాతీయ రాజకీయాల్లో కీలకంగా

జాతీయ రాజకీయాల్లో కీలకంగా

ముంబాయి పర్యటనలో భాగంగా ఎన్సీపీ అధినేత పవార్ తోనూ కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతం పైన ప్రధానంగా చర్చించారు. అయితే, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తోనూ సమావేశం అవ్వాలని ఆయన భావించారు. కానీ, కేజ్రీవాల్ ప్రస్తుతం ఢిల్లీలో అందబాటులో లేరని తెలుస్తోంది. ఇక, త్వరలోనే కేసీఆర్ మరోసారి చెన్నైలో స్టాలిన్ తో సమావేశం కానున్నట్లు సమాచారం. తాను రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తున్న కేసీఆర్.. తెలంగాణలో ఈ మధ్య కాలంలో జరిగిన సభల్లోనూ ప్రజామోదం తీసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం కేసీఆర్ వేస్తున్న అడుగులు కీలకంగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+