నేడు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇలా!!
తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాలపై గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే అనేకమార్లు మహారాష్ట్రలో పర్యటించిన కేసీఆర్ నేడు కూడా మహారాష్ట్రకు వెళ్ళనున్నారు. సామాజిక కార్యకర్త రచయిత అన్న బావు సాఠే వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం పలువురికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ షెడ్యూల్ చూస్తే..
పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బయలుదేరుతారు. 11 గంటల 15 నిమిషాలకు కొల్లాపూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. కొల్లాపూర్ లోని అంబా బాయి గా చెప్పుకునే మహాలక్ష్మి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, అక్కడినుండి 12 గంటల 45 నిమిషాలకు సాంగ్లి జిల్లాలోని వటేగావ్ చేరుకుంటారు.

అక్కడ పేరు పొందిన సామాజిక కార్యకర్త, రచయిత అయిన అన్న బావు సాఠే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అన్న బావు సాఠే అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించి ఎంతో పేరు సంపాదించారు. అటువంటి అన్న బావు సాఠే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నేనని చెబుతున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు అన్న బావు సాఠే ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులతో భేటీ అవుతారు.
ఈ సందర్భంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతాయని, అన్న బావు సాఠే కుటుంబ సభ్యులతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. ముఖ్యంగా అన్న బావు సాఠే కోడలు, మనవడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని తెలుస్తుంది.
అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు ఇస్తాం పూర్ లోని షేత్కారి సంఘటన్ నేత రఘునాథ్ దాదా పాటిల్ నివాసంలో సీఎం కేసీఆర్ భోజనం చేస్తారు. బల్లి సాయంత్రం ఐదు గంటలకు కొల్లాపూర్ విమానాశ్రయం కి చేరుకుని ప్రత్యేక విమానంలో మళ్లీ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. నిదానంగా మహారాష్ట్రలో పాదం మోపుతున్న కేసీఆర్ పార్టీ విస్తరణలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications