తేల్చుకుందాం..రండి - కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్..!!

మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రాజెక్టులపై శాసనసభ, మండలి ఉమ్మడి సమావేశాలు పెట్టడానికైనా రెడీ అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ తప్పకుండా రావాలన్నారు. 48 గంటలు కాకపోతే 2 రోజులు కంటిన్యూ చేయడానికైనా రెడీగా ఉన్నామన్నారు. ఎవరు తెలంగాణను ముంచారో తేల్చుదామంటూ కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. దీని పైన ఇప్పుడు కేసీఆర్ నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

అసెంబ్లీలో తేల్చుదాం : కృష్ణా, గోదావరి నదులపై మాజీ సీఎం కేసీఆర్‌చేసిన పాపాలను కప్పి పుచ్చె ప్రయత్నం చేస్తున్నారని, దీని వల్ల రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌కు లొంగిపోయిన విధానం వివరించారు. విభజన చట్టం ప్రకారం కృష్ణ గోదావరి నదుల మీద ప్రాజెక్ట్ ల ను కేంద్రాన్ని అప్పగించే విది విధానాలు ఖారారు చేశారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశం పైన మాట్లాడాలని సూచించారు. ప్రభుత్వం తరపున తాను, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతామన్నారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీశ్ రావు సమస్యలపై ఎంత సేపయినా అసెంబ్లీలో మాట్లాడవచ్చన్నారు. వారిద్దరూ మాట్లాడినంత సేపు ఒక నిమిషం కూడా మైక్ కట్ చేయమని అన్నారు.

CM Revanth Challenges KCR for Debate projects handover to KRBM in coming Assembly Session

కేసీఆర్ హాజరవ్వాలి : అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ తప్పకుండా రావాలన్నారు. కాలునొప్పి, కంటి నొప్పి అని కేసీఆర్ డ్రామాలు చేయొద్దని అన్నారు. ప్రాజెక్టులపై రెండు రోజులు చర్చిద్దామన్నారు. కేసీఆర్‌కు అధికారం పోయాక ఎక్కడ నొప్పి పుడుతుందో రాష్ట్ర ప్రజలకు తెలుసునని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2014లో వారి హయాం లో చట్టం రూపొందిచారని, ఈ చట్టం ఇలా ఉండటానికి కారణం వీరేనని ఆరోపించారు. 811 టీఎంసిలను ఎలా విభజించుకోవాలి.. దీనిపై ఇరు రాష్ట్రాలు ఎలా పెంచుకోవాలి అనేదానిపై కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసిందన్నారు. 2015 లో జరిగిన సమావేశంలో ఏపీకి 512, తెలంగాణకు 299 అంటూ అప్పుడే ఒప్పందానికి ఒప్పుకున్నారని రేవంత్ వివరించారు.

CM Revanth Challenges KCR for Debate projects handover to KRBM in coming Assembly Session

వారే సంతకాలు చేసారు : కృష్ణ పరివాహకం తెలంగాణ లోనే ఎక్కువ ఉంటుందన్నారు. 299 టీఎంసీ లకు ఒప్పుకున్నది అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని సీఎం వివరించారు. కానీ పరివాహక ప్రాంతం ఆధారంగా పంపకాలు జరగలేదని మండిపడ్డారు. 500 టీఎంసీల నీటి హక్కులను ఏపీ కి దారదత్తం చేశారని ఆరోపించారు. గత ఏడాది జనవరి 27 న 16 వ కేఆర్‌ఎంబీ టింగ్ జరిగిందన్నారు. ఈ సమావేశంలో కేంద్రానికి ప్రాజెక్ట్ లను అప్పగిస్తామని ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. 17 వ బోర్డు సమావేశంలో కూడా ఇదే జరిగిందన్నారు. 2023 మార్చిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో దీని నిర్వహణ కోసం బోర్డుల కోసం ప్రభుత్వం నిధులను కేటాయించిందన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేసీఆర్ సభకు హాజరైతే ప్రాజెక్టుల అంశం కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+