వరదల వేళ సీఎం రేవంత్ కీలక నిర్ణయం..!!

తెలంగాణలో భారీ వర్షాలు..వరదలకు నష్టం ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ వరద సహాయక చర్యల పైన సమీక్ష చేసారు. మంత్రులు..అధికారులకు కీలక సూచనలు చేసారు. సూర్యాపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ పర్యటింనున్నారు. ఈ విపత్తు సమయంలో ఆదుకోవాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాసారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. వరద ప్రభావిత జిల్లాలకు నిధులు మంజూరు చేసారు.

రేవంత్ సమీక్ష
వరదల కారణంగా నష్టపోయిన జిల్లాల విషయంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సాయంగా ఒక్కో జిల్లాకు రూ.5కోట్లు అందించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచించారు. కలెక్టరేట్ ల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవస్థ ను సన్నద్దంగా ఉంచుకోవాలని రేవంత్ సూచించారు.

CM Revanth letter to PM Modi on flood situations seek Central assistance

నిధుల విడుదల
భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలో ని ఎనిమిది పోలీస్ బెటాలియన్ల కు ఎన్డీఆర్ఎఫ్ తరహా లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించేలా చూడాలని నిర్దేశించారు. ప్రజలకు జరిగిన నష్టం పై తక్షణమే అధికారులు స్పందించాలని సూచించారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెల కు పరిహారం పెంచాలని నిర్ణయించారు. వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.

ప్రధానికి లేఖ
తక్షణమే కేంద్ర సాయం కోరుతు ముఖ్యమంత్రి లేఖ రాసారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతు ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో కోరారు. ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్ల లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు విడుదల చేసారు. హైదరాబాద్ లో వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం, సూర్యాపేటలో రేవంత్ వరద పరిస్థితిని సమీక్షించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+