మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా, ఆధ్యాత్మిక వైభవానికి తొలి అడుగు పడింది. గండిపేట పరిధిలోని మంచిరేవుల వద్ద 8 ఎకరాలలో, 700 కోట్ల రూపాయల వ్యయంతో మచిలేశ్వర ఆలయాన్ని, ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
మచిలేశ్వర, ఓంకారేశ్వర ఆలయాల శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శృంగేరి శారదాపీఠం సూచనలతో ఈ ఆలయ శైలి, డిజైన్ ఖరారు చేసి నిర్మించనున్నారు. ఇది చారిత్రక వీరభద్ర స్వామి ఆలయానికి సమీపంలో భక్తులకు మూసి తీరాన ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వనుంది.700 కోట్ల రూపాయలతో అత్యంత ఘనంగా ఓంకారేశ్వర ఆలయాన్ని, మచిలేశ్వర స్వామి ఆలయాన్ని శంకు నాదాలు, గంటా నాదాల మధ్య శంకుస్థాపన చేసిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

8 ఎకరాల్లో 700 కోట్లతో ఆలయాల అభివృద్ధి
ఒక చారిత్రాత్మక మందిరాన్ని నిర్మించుకోవడం ఒక చారిత్రక సందర్భం అన్నారు. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇది జరుగుతుందని అనుకోవట్లేదన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు, ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమం అన్నారు. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన అన్నారు.
మానవ తప్పిదాలతోనే మూసీ కాలుష్యకారకంగా మారింది
మూసీ నది పునరుజ్జీవంపై చాలా మంది ప్రయత్నించారు. కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదన్నారు. ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తాడన్నారు. తెలంగాణ పౌరులకు నా విజ్ఞప్తి ఒక్కటే అన్నారు.చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందిందన్నారు. కానీ ఇక్కడ ఇంతకాలం జరగలేదన్నారు.మానవ తప్పిదాలతోనే మూసీ కాలుష్యకారకంగా మారిందన్నారు..
విమర్శించే వారిపై ప్రజలే శివతాండవం చేస్తారు
గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. రాజకీయ కారణాలతో మూసీ పునరుజ్జీవనంను అడ్డుకోవడం ఏ సంస్కృతి? అన్నారు. దీనిపై పెడర్ధాలు తీసి విమర్శించే వారిపై ప్రజలే శివతాండవం చేస్తారన్నారు. మూసీ పరివాహకంలో మతసామరస్యానికి చిహ్నంగా ఒక మసీదు, నాగోల్ ప్రాంతంలో ఒక చర్చిని నిర్మించబోతున్నామన్నారు. గోదావరి జలాలను తరలించి మూసీలో నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మూసీ ప్రక్షాళన చెయ్యకుంటే చరిత్ర మనను క్షమించదు
మూసీ కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ ప్రజల కష్టాలు చూడలేని వారు రాయి కంటే కఠినాత్ములు అన్నారు. మానవ తప్పిదాలను సరిద్దిద్దకపోతే చరిత్ర మనల్ని క్షమించదన్నారు. మూసీ పరివాహక ప్రజాప్రతినిధులు మూసీ ప్రక్షాళన చెయ్యాల్సిందే అని రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తున్నారన్నారు.
గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వెనక్కు తీసుకోవాలి
కానీ తాము చేయలేనిది ఎవరూ చేయొద్దనే అక్కసుతో కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. కొందరు రాజకీయాల కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశారని, దానిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రామప్ప శివుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దుతామన్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications