గండపెండేరం తొడుగుతా... కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు రేవంత్ టాస్క్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ముఖ్యంగా ఐదు ప్రధాన అంశాలపైన ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి తన విజ్ఞప్తిని చేశారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ కమ్ రైల్ ప్రాజెక్ట్, డ్రైపోర్ట్, రక్షణారంగ ప్రాజెక్టులకు సహకరించాలని సెమీ కండక్టర్ల ప్రాజెక్టు తెలంగాణకు కేటాయించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.
ప్రధానితో సీఎం రేవంత్ భేటీ.. కేంద్ర మంత్రుల టార్గెట్
అంతేకాదు రాష్ట్రంలో ఐపీఎస్ ల కొరత బాగా ఉందని, అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. అంతేకాదు మూసి ప్రాజెక్టుకు 20 వేల కోట్ల రూపాయలను మంజూరు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక ప్రధానితో సమావేశం అయినా అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రులను టార్గెట్ చేశారు.

కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై రేవంత్ వ్యాఖ్యలు
రాష్ట్రం నుంచి చేస్తున్న ఐదు విజ్ఞప్తులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం అవసరమని, కేంద్ర క్యాబినెట్ నుండి ఆమోదం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రుల కిషన్ రెడ్డి, బండి సంజయ్ లేనని ఆయన పేర్కొన్నారు. ఈ ఐదు ప్రాజెక్టులు తీసుకువస్తే కిషన్ రెడ్డికి గండపెండేరం తొడుగుతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కిషన్ రెడ్డిపై సంచలన ఆరోపణ, బీఆర్ఎస్ నాయకత్వాన్ని టార్గెట్
మెట్రో రైల్ విస్తరణ అంశం కేంద్ర క్యాబినెట్ ముందుకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇక బీఆర్ఎస్ నాయకత్వం పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారని, కేసు వాదించిన సంజీవరెడ్డి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందారని పేర్కొన్నారు.
వారంతా మిస్టీరియస్ గా మరణిస్తే ఎంక్వైరీ కోరరా?
కేటీఆర్ బిజినెస్ పార్టనర్ కేదార్ దుబాయ్ లో అనుమానాస్పదంగా చనిపోయారని, రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో అతను కీలక నిందితుడని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ అనుమానాస్పద మరణాలపైన కేటీఆర్ కి ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. ఎందుకు కేటీఆర్ ఈ మరణాల పైన జ్యూడిషియల్ ఎంక్వయిరీ కోరడం లేదని రేవంత్ రెడ్డి నిలదీశారు.
ఆ నివేదికలు వచ్చాక మాట్లాడతా
కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా పలు ప్రాజెక్టుల అక్రమాల పైన ఇప్పుడు ఏమి మాట్లాడేది లేదని ప్రాజెక్టులపై సాంకేతిక నివేదికలు వచ్చిన తర్వాత మాట్లాడతానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications