New Ration Card: కొత్త రేషన్ కార్డులపై రేవంత్ శుభవార్త.. ఆ ప్రక్రియ ప్రారంభం..!
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు. అలాగే ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. రూ.500 గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకరానున్నారు. అలాగే మహిళలకు నెలకు రూ.2500 పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉంది.
ఇవన్నీ సంక్షేమ పథకాలు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. అయితే గత ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ఆగిపోవడంతో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో డిసెంబర్, జనవరిలో ప్రజాపాలన దరఖాస్తలు స్వీకరించారు. ప్రజాపాలనలో 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. అభయహస్తం కోసం 1,05,91,636 దరఖాస్తులు వచ్చాయి. కొత్త రేషన్ కార్డుల కోసం 19,92,747 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

ఆ తర్వాత కొంత మంది మీ సేవ ద్వారా కూడా కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో రేషన్ కార్డు ఇ కేవైసీ ప్రక్రియ కొనసాగింది. ఇ కేవైసీ చేసుకోవడానికి ఫిబ్రవరి 29తో గడువు ముగిసింది. 80 శాతం మంది ఇ కేవైసీ చేసుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రక్రియ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. రేషన్ కార్డులను అర్హులకు మాత్రమే జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇందుకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో పని చేసే అవకాశం ఉంది. గతంలో 5 ఎకరాల లోపు ఉన్నవారికి రేషన్ కార్డు ఉండేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత భూమితో సంబంధం లేకుండా రేషన్ కార్డులు జారీ చేశారు. ఇప్పుడు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కాగా కొత్త రేషన్ కార్డులపై మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications