వరద పరిహారం ప్రకటించిన రేవంత్ - రూ 5 వేల కోట్ల నష్టం..!!
తెలంగాణలో భారీ వర్షాలు..వరదలతో అనూహ్యంగా నష్టం చోటు చేసుకుంది. ప్రాణ నష్టం జరిగింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ పరిహారం ప్రకటించారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని వెల్లడించారు. తెలంగాణకు ఈ వర్షాల కారణంగా దాదాపు రూ 5 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రేవంత్ చెప్పారు. ప్రధానికి లేఖ రాసిన రేవంత్ తెలంగాణలో పరిస్థితులను వివరించారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు.
రేవంత్ పర్యటన
ముఖ్యమంత్రి రేవంత్ సూర్యాపేటలో పర్యటించారు. వరద తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. జల్లా సమీక్షలో కీలక సూచనలు చేసారు. జిల్లా లో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం బాధితులకు అండగా నిలవాలని సూచించారు. సాగర్ ఎడమకాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టం పైన ఆరా తీసిన ముఖ్యమంత్రి సహాయ చర్యలపైన వివరాలు కోరారు. సూర్యాపేట జిల్లా లో 30 సెంటిమీటర్ల అతి భారీ వర్షం పడిందని అధికారులు వెల్లడించారు.

రూ 5 వేల కోట్ల నష్టం
అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారని చెప్పిన అధికారులు..పంట, ఆస్తి నష్టం పైన అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం నిరంతరం మంత్రులు,ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఖమ్మం,నల్లగొండ పరిస్థితి పైన ప్రధాని మోదీ, అమిత్ షా,రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరినట్లు వెల్లడించారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తున్నామన్నారు.
ప్రధానికి లేఖ
పశువులు చనిపోతే 50 వేల సాయం చేస్తున్నామని రేవంత్ వివరించారు. పంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి పదివేల సాయం ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. సూర్యాపేట కలెక్టర్ కు తక్షణ సాయంగా ఐదు కోట్లు విడుదల చేసారు. పాఠశాల సెలవులపైన జిల్లా కలెక్టర్ల కు నిర్ణయాధికారం ఉంటుందన్నారు. వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు చెప్పారు. వరద సమయంలో బురద రాజకీయాలు సరికాదన్నారు. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాన మోదీ ని ఆహ్వానించామని చెప్పారు.












Click it and Unblock the Notifications