రేవంత్ మంత్రివర్గంలోకి ఆ అయిదుగురు - ముహూర్తం ఫిక్స్..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ ఖరారు కావటంతో ఇప్పుడు రేవంత్ మంత్రివర్గ విస్తరణ పైన ఫోకస్ చేసారు. తాజాగా అసెంబ్లీ కమిటీలను ప్రకటించారు. నామినేటెడ్ రెండో దశ పదవులకు ముందే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు. తాజా ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు ఆమోదం తీసుకోనున్నారు. కొత్తగా మంత్రులయ్యే వారి విషయం లోనూ నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది.

ఢిల్లీకి రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ మంత్రివర్గ విస్తరణ...నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం సుదీర్ఘ కసరత్తు తరువాత టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమర్ గౌడ్ ను నియమించింది. ఇక, మంత్రివర్గ విస్తరణ పైన ఇప్పటికే చర్చలు జరిగాయి. పోటీ ఎక్కువగా ఉండటంతో హైకమాండ్ ఆచి తూచి అడుగులు వస్తోంది. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో రేపు భేటీ కానున్నారు. వరద నష్టం అంచనా విరాలు చెప్పి కేంద్ర సాయం కోరనున్నారు. ఇప్పటికే వరద నష్టం పై కేంద్రానికి లేఖ రాసారు.

CM Revanth to meet Amith Shah on Central assistance for Floods in the state

మంత్రివర్గ విస్తరణ
తెలంగాణలో రూ 5,400 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాధమికంగా అంచనాకు వచ్చింది. ఇక..ఈ సారి పర్యటనలో మంత్రివర్గ విస్తరణ కు ఆమోదం వస్తుందని అంచనా వేస్తున్నారు.మంత్రుల రేసులో ఆదిలాబాద్ నుంచి గడ్డెం బ్రదర్స్, మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

మంత్రులయ్యేదెవరు
మహబూబ్ నగర్ నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి ముదిరాజ్ కోటాలలో ఖాయమని చెబుతున్నారు మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, అజారుద్దీన్ పదవులను ఆశిస్తున్నా ఎవరికి దక్కుతుందనేది చూడాల్సి ఉంది. అయితే, ఆరు పదవులు ఖాళీ ఉన్నా..అయిదుగురికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మంత్రివర్గం..నామినేటెడ్ పదవుల ను భర్తీ చేయటం ద్వారా పూర్తి స్థాయిలో జోష్ వస్తుందని భావిస్తున్నారు. దీంతో, దసరా లోగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+