వర్షంలోనే వాగ్వాదం: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కలెక్టర్‌కు మధ్య కోల్డ్ వార్

దీంతో కలెక్టర్ కాస్త చిన్నబుచ్చుకున్నారు. 'కలెక్టర్ ను నన్నే అడుగుతారా సార్..' అంటూ వర్షంలో తడుస్తూనే కాల్ లిస్ట్ చూపించే ప్రయత్నం చేశారు.

జనగామ: జనగామ జిల్లా కలెక్టర్ దేవసేనకు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవల జిల్లాలో నిర్వహించిన సీడ్ బాల్స్ బాంబింగ్ కార్యక్రమంపై తనకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కలెక్టర్ దేవసేనను నిలదీశారు.

తాను ఐదు సార్లు ఫోన్ చేసినా.. మీ నుంచి ఎలాంటి స్పందన లేదని తన మొబైల్ లో కాల్ లిస్ట్ చూపిస్తూ ఎమ్మెల్యేకు కలెక్టర్ వివరించే ప్రయత్నం చేశారు. దీంతో ఎమ్మెల్యేకు, కలెక్టర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. భువనగరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సమక్షంలోనే ఈ గొడవ జరగడం గమనార్హం.

cold war between trs mla and district collector

జనగామ పట్టణ శివార్లలోని చంపక్‌హిల్స్‌ మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలిసి బస్‌ షెల్టర్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గురువారం శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈ వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యక్రమం ముగించుకుని కలెక్టర్ వెళ్తున్న సమయంలో.. ముత్తిరెడ్డి ఆమెను ప్రశ్నించారు.

Recommended Video

    TRS Will Contest In 2019 Andhra Pradesh Elections

    'కలెక్టరమ్మా.. ఈ నెల 3న చంపక్‌హిల్స్‌లో జరిగిన సీడ్‌బాల్స్‌ బాంబింగ్‌ కార్యక్రమం గురించి నాకెందుకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు!?'అని నిలదీశారు. దీంతో 'ఐదుసార్లు కాల్ చేశఆను సార్.. మీరే ఫోన్ లిఫ్ట్ చేయలేదు' అని కలెక్టర్ బదులిచ్చారు. నాకెలాంటి ఫోన్ రాలేదని, కాల్ చేసింది నిజమే అయితే ఫోన్ కాల్ లిస్ట్ చూపించాలని ముత్తిరెడ్డి అడిగారు.

    దీంతో కలెక్టర్ కాస్త చిన్నబుచ్చుకున్నారు. 'కలెక్టర్ ను నన్నే అడుగుతారా సార్..' అంటూ వర్షంలో తడుస్తూనే కాల్ లిస్ట్ చూపించే ప్రయత్నం చేశారు. ఇంతలో ఎంపీ బూరనర్సయ్య గౌడ్ కల్పించుకుని ఇద్దరి మధ్య వాగ్వాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆపై అంతా అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+