ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి రండి; ప్రజలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం!!
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించి రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టింది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే , కేసీ వేణుగోపాల్ తదితరులు రానున్నారు.
ఏఐసీసీ నేతలతో పాటుగా ఇతర రాష్ట్రాల నేతలకు, ముఖ్యమంత్రులకు, మంత్రులకు ఈ మేరకు ఆహ్వానం పంపారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రులు, తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపారు.

గతంలో తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలుగా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, వాయిలార్ రవి, కుంతియా, మాణిక్యం ఠాగూర్ తదితరులను కూడా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానం పంపారు. ఇక హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు వివిధ కుల సంఘాల నేతలకు, మేధావులను ఆహ్వానిస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్ మరికొందరు నేతలకు కూడా ఆహ్వానం పంపారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను, ఉద్యమకారులను ఆహ్వానించారు. ఇక వీరికి మాత్రమే కాకుండా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపి ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ఆహ్వానం పంపారు.
విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పారదర్శక పాలన అందించేందుకు, బలహీనవర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళా, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో ఈ 2023 డిసెంబర్ 7న మధ్యాహ్నం ఒంటిగంట నాలుగు నిమిషాలకు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుంది.
ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వానం.. మీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు అంటూ రేవంత్ రెడ్డి ప్రజలకు ఆహ్వానం పంపారు. తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.
-
మూసీపై కేబినెట్ సబ్ కమిటీ- సభ్యులు వీళ్లే -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications