బఫర్ జోన్లో యూనివర్సిటీ కట్టారని ఫిర్యాదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లాపై కేసు

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. చెరువుల బఫర్ జోన్లో రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ నిర్మించారని ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురం, నాధం చెరువుల బఫర్ జోన్లలో అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ నిర్మించారని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇరిగేషన్ శాఖ అధికారుల ఫిర్యాదుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, హైదరాబాద్ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝలిపిస్తూన్న విషయం తెషయం తెలిసిందే. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో రూల్స్ కు విరుద్ధంగా నిర్మించారంటూ మాదాపూర్‌లో సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంట్‌ను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే.

Complaint that Anurag University was built in buffer zone Case against BRS MLA Palla

అయితే, నాగార్జున ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపాలని కోర్టు ఆదేశించింది. అయితే, అప్పటికే దాదాపు ఎన్ కన్వెషన్ నిర్మాణాన్ని దాదాపు కూల్చివేయడ గమనార్హం. మరోవైపు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు సరికాదని వ్యాఖ్యానించారు.

'ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని'అని నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+