వరంగల్ ఆర్డీవో వాహనంతో సహా కార్యాలయ ఆస్తుల జప్తు.. కారణమిదే!!
వరంగల్ ఆర్టీవో కార్యాలయ ఆస్తులను జప్తు చేశారు భూసేకరణ పునరావాస పునర్నిర్మాణ మండలి అధికారులు. ఒక రైతు భూమిని సేకరించి అతనికి చెల్లించవలసిన నష్ట పరిహారం చెల్లించకుండా రైతును ఇబ్బందులు పెడుతున్న క్రమంలో మండలి సంచలన తీర్పునిచ్చింది. ఆర్టీవో కార్యాలయ ఆస్తులను జప్తు చేసి రైతు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కోసం భూసేకరణ
వరంగల్ జిల్లా కాకతీయ మెగా జౌళి పార్క్ కోసం స్థలం ఇచ్చిన గీసుకొండ మండలం శాయంపేటకు చెందిన సముద్రాల యాక స్వామి ఆయన కుమార్తె వెన్నెలకు చెందిన పలు సర్వే నెంబర్లలో ఉన్న 20 ఎకరాల భూమిని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కోసం భూసేకరణ చేస్తున్నట్టుగా మొదట అధికారులు ప్రకటించారు. దీనికి ఎకరానికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారంగా నిర్ణయించారు.

పరిహారం సరిపోదని రైతు కుటుంబం విజ్ఞప్తి
ఆ తర్వాత మళ్లీ భూసేకరణ అవసరం లేదని రైతుకు తెలిపారు. మళ్లీ నాలుగేళ్లు గడిచిన తర్వాత మళ్లీ భూమిని సేకరిస్తున్నట్లుగా నోటీసులు జారీ చేశారు అధికారులు. అయితే నాలుగేళ్ల క్రితం ఎకరానికి 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారమే భూసేకరణ చేస్తామని చెప్పడంతో, తమకు పరిహారం సరిపోదని పరిహారాన్ని పెంచి ఇవ్వాలని అప్పటి కలెక్టర్ తో పాటు ఆర్డీవోకు, ఇతర అధికారులకు రైతు కుటుంబ విజ్ఞప్తి చేసింది.
ఆరునెలల క్రితమే రైతు నష్ట పరిహారం పెంచి ఇవ్వాలన్న మండలి
అయితే అధికారులు రైతు విజ్ఞప్తిని పట్టించుకోక పోవడంతో వారు భూసేకరణ పునరావాస పునర్నిర్మాణ మండలిని ఆశ్రయించారు. సర్వే నెంబర్లలో ఉన్న లోటుపాట్ల నేపథ్యంలో 20 ఎకరాలకు 12 ఎకరాలకే నష్టపరిహారం పెంచి ఇవ్వాలని వారు మండలిలో కేసు వేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన మండలి రైతు కుటుంబం చేసిన న్యాయ పోరాటంతో ఆరు నెలల క్రితం రైతుకు నష్టపరిహారం పెంచి ఇవ్వాలని మండలి తీర్పునిచ్చింది.
మండలి ఆదేశాలు బేఖాతరు.. ఆస్తుల జప్తుకు ఆదేశం
అయితే తీర్పును అధికారులు బేఖాతరు చేయడంతో, మళ్లీ మండలిని ఆశ్రయించిన రైతుకు ఆర్డీవో ఆస్తులను జప్తు చేసి, రైతు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. దీంతో మండలి అధికారులు, సిబ్బంది ఆర్డీవో కార్యాలయంలోని ఏసీలు, కూలర్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఆర్టీవో వాహనాన్ని సహా సీజ్ చేసి స్టిక్కర్లు అతికించారు. అయితే ఆర్డిఓ ఆస్తుల జప్తు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి, కలెక్టర్ ఆదేశాలతో తదుపరి చర్యలు చేపడతామని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్ తెలిపారు.












Click it and Unblock the Notifications